International
భారత్ యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం” — ప్రధాని మోదీ
భారత దేశం ఆయుధ పరంగా ఎంత శక్తివంతంగా ఉన్నా, దాని లక్ష్యం శాంతి సాధనమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ భద్రత మెరుగ్గా ఉండగానే విజ్ఞానపరమైన పురోగతికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.
“భారత ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించాం. గత 11 ఏళ్లలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. భారత్ యుద్ధం చేయడానికే కాదు… బుద్ధం చూపిన మార్గాన్ని అనుసరించేందుకే ఉంది” అని మోదీ స్పష్టం చేశారు.