Latest Updates

నటుడు మృతి.. కారణమిదే

Mukul Devs Death: నా సోదరుడు ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: రాహుల్‌ దేవ్‌ |  rahul-dev-reveals-reason-behind-his-brother-mukul-devs-death

ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మరణానికి సంబంధించిన కారణాలను ఆయన సోదరుడు రాహుల్ దేవ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముకుల్ దేవ్ డిప్రెషన్ కారణంగా చనిపోలేదని, గత కొంతకాలంగా ఆయన సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం ఒక ప్రధాన కారణమని రాహుల్ తెలిపారు. ఆయన వారం రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందారని, అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించి మరణించారని వివరించారు. ఈ విషాద సంఘటన బాలీవుడ్ పరిశ్రమలో షాక్‌కు గురిచేసింది.

ముకుల్ దేవ్ ఒంటరితనంతో ఎక్కువగా బాధపడ్డారని రాహుల్ చెప్పారు. 2019లో తండ్రి మరణం, ఆ తర్వాత తల్లి కూడా చనిపోవడం, భార్యతో విడాకులు వంటి వ్యక్తిగత జీవితంలోని సంఘటనలు ఆయనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సరైన శ్రద్ధ తీసుకునే వారు లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారని, ఇది ఆయన ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపించిందని రాహుల్ విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version