Entertainment

రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు.. దుమ్మురేపిన సినిమా

రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు.. దుమ్మురేపిన సినిమా

ఇప్పటి ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల హవా నడుస్తోంది. కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, పాత సినిమాలు కూడా రీ రిలీజ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రీసెంట్‌గా వచ్చిన “దేవర” సినిమా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే, మరోవైపు ఓటీటీల్లో కూడా కొత్త సినిమాలు అదరగొడుతున్నాయి. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతుండగా, కొన్ని సినిమాలు రీ రిలీజ్ సమయంలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించి సక్సెస్ అవుతున్నాయి. అందులో ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు తమ ఫేవరేట్ హీరోల సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసి ఆనందపడుతున్నారు.

అయితే, ఇప్పుడు రీ రిలీజ్‌లో ఓ సినిమా, రిలీజ్ కంటే ఎక్కువ వసూలు చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ సినిమానే హారర్ థ్రిల్లర్ “తుంబాడ్.” ఈ సినిమా చూడాలంటే నిజంగా దైర్యం కావాలి. మైథలాజికల్ హారర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీని రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2018లో రిలీజ్ అయినప్పటికి, పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ, ఓటీటీలోకి

వచ్చిన తర్వాత ఈ సినిమా ఓ సూపర్ హిట్‌గా మారింది, ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఇష్టపడ్డారు.

తుంబాడ్ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. దాంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లో “తుంబాడ్” సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. రీ రిలీజ్‌లో ఏకంగా రూ. 30 కోట్ల వసూళ్లు చేసి, సంచలనంగా నిలిచింది. 2018లో చిన్న సినిమాగా విడుదలైన “తుంబాడ్” అప్పట్లో కేవలం రూ. 12 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో రీ రిలీజ్ చేయగా, ఈ సారి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించింది. ఈ రీ రిలీజ్‌తో ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version