Telangana

సికింద్రాబాద్‌లో విషాదం.. గొంతులో చపాతీ రోల్ ఇరుక్కుని విద్యార్థి మృతి..

సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి చపాతీ రోల్ తింటూ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. విరాన్ జైన్ అనే విద్యార్థి టివోలి థియేటర్ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు. సోమవారం రోజున స్కూలుకు వచ్చి, లంచ్ కోసం చపాతీ రోల్ తెచ్చుకున్నాడు. కానీ భోజనం సమయంలో చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక విరాన్ జైన్ ఇబ్బంది పడగా, పక్కన ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు, కానీ మార్గమధ్యంలోనే ఆయన చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికీ ఇలాంటి ఘటనలు మరిన్ని జరగడం చూస్తున్నాం. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఒక వ్యక్తి దోసె తింటూ గొంతులో ఇరుక్కుని మరణించాడు. ఆయన మద్యం తాగి దోసె తింటుండగా అది గొంతులో చిక్కిపోయింది. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. దీనికి సంబంధించిన విషయాలు మీడియాలో ఉన్నాయి.

ముఖ్యంగా చికెన్, మటన్ ముక్కలు గొంతులో ఇరుక్కునడం సహజమే కానీ, ఈ మధ్యకాలంలో మెత్తైన ఆహారాలు అయిన దోసె, ఇడ్లీ, చపాతీలు కూడా గొంతులో చిక్కుకుని ప్రాణాల పోగొట్టుకోవడం చర్చనీయాంశమైంది.

వైద్యులు ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గొంతులో ఆహారం ఇరుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుందనేవి కొన్ని కారణాలు. ఒకేసారి ఎక్కువగా ఆహారం తినడం లేదా తింటూ మాట్లాడడం వలన ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోవచ్చు. దీంతో ఊపిరి ఆడకపోతే శరీరంలో ఆక్సిజన్ కొరత తలెత్తుతుంది. ఎక్కువసేపు ఊపిరి ఆడకపోతే ప్రాణహాని కూడా ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version