Connect with us

Latest Updates

రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక: మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

y cube news

భారతీయ రైల్వే శాఖ మే 1, 2025 నుంచి కొత్త నియమాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త రూల్ ప్రకారం, వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు. స్లీపర్ క్లాస్‌లో అనధికారికంగా ప్రయాణిస్తే రూ.250, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తే రూ.440 జరిమానాగా వసూలు చేయబడుతుంది. అంతేకాకుండా, బోర్డింగ్ పాయింట్ నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నియమం ప్రకారం, టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు ఇక నుంచి జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు రైలు ప్రయాణంలో క్రమశిక్షణను పాటించేలా చేయడంతో పాటు, కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కాబట్టి, రైలు ప్రయాణికులు ఈ కొత్త నియమాలను గమనించి, తమ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించాలని రైల్వే శాఖ సూచిస్తోంది. జరిమానా మరియు అసౌకర్యాలను నివారించేందుకు, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరుతోంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending