Connect with us

Andhra Pradesh

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై అంబటి రాంబాబు స్పందన

AP Press Academy : కొమ్మినేని రాకతో ఏపీ ప్రెస్ అకాడమీకి పూర్వ వైభవం  వస్తుందా…?-sr jpurnalist kommineni srinivasa rao appointed as chairman of  ap press academy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కొమ్మినేని శ్రీనివాసరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన తనపై విమర్శలు చేస్తున్నారన్న కక్షతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అరెస్టును ప్రేరేపించారని అంబటి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేస్తూ చంద్రబాబు, నారా లోకేశ్‌లను ట్యాగ్ చేశారు.

కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చలో మరో జర్నలిస్టు అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending