National
కర్ణాటకలో మళ్లీ కులగణన: ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవల జరిగిన కులగణన ఫలితాలపై విపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు, మంత్రులు కూడా బహిరంగంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా అగ్ర వర్ణాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి కులగణన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
కులగణన ద్వారా రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల జనాభా, సామాజిక-ఆర్థిక స్థితిగతులను ఖచ్చితంగా గుర్తించి, సంక్షేమ పథకాల అమలుకు దోహదపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు