Latest Updates
Vinesh Phogat జులానాలో ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగట్

Vinesh Phogat జులానాలో ఎమ్మెల్యేగా గెలిచిన వినేశ్ ఫోగట్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. జులానా నియోజకవర్గంలో 6వేలకుపైగా ఓట్లతో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. హరియాణా శాసనసభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫోగట్.. జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు.
100 గ్రాముల అధిక బరువు కారణంగా.. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయి.. చివరి మెట్టుపై బోల్తా పడిన వినేశ్ ఫోగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జులానా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. యోగేష్ కుమార్‌పై బీజేపీ తరఫున బరిలోకి దిగిన 6వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. జులానా నియోజకవర్గంలో గత 19 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి రాని విజయాన్ని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వినేశ్ ఫోగట్ అందించారు.
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫోగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా.. పోటీ నుంచి అనర్హతకు గురయ్యారు. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక ఆ పారిస్ ఒలింపిక్స్ తర్వాత.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన వినేశ్ ఫోగట్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సెప్టెంబర్ 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం హస్తం పార్టీ ఆమెకు హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా టికెట్ కేటాయించింది. ఇక గతేడాది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ రెజ్లర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేయగా.. వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఇక అందరి అంచనాలు కూడా తలకిందులు చేస్తూ.. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక మెజార్టీ లో అసెంబ్లీ స్థానాలలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే 2014, 2019లో గెలిచి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ తాజాగా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి హరియాణా రాజకీయాల్లో ఒక కొత్త రికార్డును సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు