Connect with us

Andhra Pradesh

సీఎం చంద్రబాబు ప్రజలకు good news చెప్పారు

విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం లో లడ్డు ధర్శనం ఫ్రీ

విజయవాడ కనక దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మను  దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వీఐపీలను పక్కనబెట్టి సామాన్య భక్తులకు ఆలయ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. వారిని పోలీసులు కంపార్ట్‌మెంట్‌లలో ఉంచి క్యూలోకి పంపుతున్నారు. కాగా, ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు.

ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం అనంతరం చంద్రబాబు తలకు స్థానాచార్యులు శివప్రసాద్‌ శర్మ పరివేట్టం చుట్టగా.. పట్టువస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై ఉంచి గర్భాలయంలోకి తీసుకెళ్లారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పించి తన కుటుంబ సభ్యులతో అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో ఏర్పాట్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.  భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు.

కేశఖండన శాలపై 96 శాతం డెకరేసన్ 92 శాతం క్యూలైన్లు 85 శాతం, ఆలయ, తాగునీరు దాదాపు 95 శాతం, అన్నప్రసాదం 95 శాతం, లడ్డూ ప్రసాదంపై 93 శాతం, పరిసరాల పరిశుభ్రత 87 శాతం సంతృప్తికరంగా ఉందని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని అన్నారు.

‘మూలా నక్షత్రం రోజున అమ్మవార్ని దర్శించుకోవడం అదృష్టం. ఈ ఏడాది రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి.. దుర్గమ్మ తల్లి దయవల్ల ఎన్నడూలేనివిధంగా కృష్ణానది పొంగిప్రవహిస్తోంది.. రాజధాని అమరావతితో పాటు పోలవరం నిర్మాణం కూడా పూర్తికావాలని,  రాబోయే రోజుల్లో సక్రమంగా వర్షాలు కురిసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని, నదుల అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసం వారికి అండగా ఉండాలనేది మా అభిమతం.. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisement

ఇంద్రకీలాద్రి.. తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయం, 5.80 లక్షల మంది అమ్మవారిని దసరా ఉత్సవాల్లో ఇప్పటి వరకూ దర్శించుకున్నారని తెలిపారు. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో ఎంతో పవిత్రమైన రోజు అందుకే అందరికీ ఉచిత దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తున్నారు .

 

Loading

Trending