Latest Updates
పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‌తో యుద్ధంపై ముఖ్యమైన సూచన..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్టు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని మరింత పెంచుకోవద్దని ట్రంప్ సూచించినట్టు పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించిన రెండు రోజులు తర్వాత, ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ నుంచి ట్రంప్, గురువారం పుతిన్‌కు ఫోన్ చేశారని చెప్పింది. దీనిపై ట్రంప్ ప్రతినిధులను సంప్రదించగా, వారు స్పందించలేదు అని అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
పుతిన్‌తో కాల్‌లో మాట్లాడిన ట్రంప్.. ఐరోపాలో అమెరికా గణనీయమైన సైనిక ఉనికిని గుర్తు చేశారని ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ నివేదించింది. ‘త్వరలో ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారం గురించి చర్చించడానికి తదుపరి సంభాషణలపై కూడా ఆసక్తి వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు. ట్రంప్ ఎన్నిక దాదాపు మూడేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పడి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలని, కీవ్‌కు అమెరికా బిలియన్ డాలర్ల మద్దతుపై సందేహాన్ని వ్యక్తం చేశాడు.
మరొకవైపు, ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీ కూడా ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, వీరిద్దరి మధ్య యుద్ధం గురించి చర్చ జరిగింది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఈ చర్చలో పాల్గొన్నట్లు సమాచారం. ట్రంప్‌తో సంభాషణ అద్బుతంగా సాగిందని జెలెన్‌స్కీ అభివర్ణించారు. చర్చలు కొనసాగించడానికి, మా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్ అంగీకరించారని చెప్పారు.
జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం జరగకముందు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు వీలైనంత ఎక్కువ సహాయాన్ని పంపుతామని ధ్రువీకరించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలేవన్ అన్నారు, “యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఉక్రెయిన్‌ను బలంగా నిలబెట్టడం వైట్‌హౌస్ లక్ష్యం. చివరికి, చర్చల సమయంలో అది సాధ్యమైనంత బలంగా ఉండేందుకు చూస్తాము.” ఉక్రెయిన్‌కు ఇచ్చిన 6 బిలియన్ల డాలర్ల మిగులు నిధులు కూడా ఈ సహాయంలో ఉన్నాయి అని సుల్లివన్ తెలిపారు.
అటు, రష్యా ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తున్నా.. ట్రంప్ గెలుపుతో సానుకూలంగా ఉంది. ఇదే అంశంపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆదివారం మాట్లాడుతూ,.. ‘సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి… కనీసం అతను శాంతి గురించి మాట్లాడుతున్నాడు.. ఘర్షణ గురించి కాదు’ అని అన్నారు. ప్రచార సమయంలో ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలనే చిత్తం వ్యక్తం చేశారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు