Latest Updates
UPI కొత్త ఫీచర్లు: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు ముఖ్య సమాచారం!
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి వాడుతున్న యూజర్లకు ఒక్క మంచి వార్త. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) సంయుక్తంగా UPIకి కొత్త ఫీచర్లు ప్రకటించాయి.
ఇకపై జాయింట్ అకౌంట్లలో UPI చెల్లింపులకు మల్టీ-సిగ్నేటరీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా, వేరబుల్ గ్లాసెస్ (smart glasses) వాడుతూ హ్యాండ్స్ ఫ్రీగా చెల్లింపులు చేయొచ్చు. ఫోన్ లేకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో పేమెంట్లు పూర్తవుతాయి.
అంతేకాక, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి PIN టైప్ చేయకుండా ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. ఇకపై ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా UPI PIN సెట్ చేయడం సులభం.
ఇంకొక కీలక మార్పు — UPI క్యాష్ పాయింట్లు ద్వారా మైక్రో ATMల నుంచి నగదు ఉపసంహరణ. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది.
ఈ మార్పులు అన్ని యూజర్లకు డిజిటల్ పేమెంట్లను సురక్షితంగా, వేగంగా చేయడంలో సహాయపడతాయి. అప్‌డేటెడ్ యాప్‌లు ద్వారా ఈ ఫీచర్లు త్వరలో అందుబాటులోకి వస్తాయి.
![]()
