Telangana
హైదరాబాద్‌లో కుంగిన రోడ్డు.. 200 మీటర్ల దూరం.. పెద్ద ప్రమాదమే తప్పింది..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు భారీగా కుంగిపోయింది. రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అయితే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరుగుతుండటంతో.. అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సీవరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ఇప్పుడు కుంగిన ప్రదేశానికి 200 మీటర్ల దూరంలోనే.. గతంలో కూడా ఇలానే రోడ్డు కుంగిపోయిందని చెప్తున్నారు.
2022 డిసెంబర్‌లోనూ ఇదే మార్గంలో నాలా కూలిపోయి.. డ్రైనేజీలో కుప్పకూలిన సంఘటనలు ఉన్నాయి. ఆ సమయంలో.. రోడ్డుపై నిలిపి ఉంచిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలన్ని నాలాలో పడిపోయాయి. నాలాపై ఉన్న కూరగాయల దుకాణాలు, పూల దుకాణాలు కూడా నాలాలో పడిపోయాయి. ఈ ఘటనలో కొంతమంది అందులో పడిపోయి గాయపడ్డారు.
అయితే.. ఇప్పుడు కుంగిపోయిన రోడ్డు ప్రాంతం కూడా ఎల్లపుడు రద్దీగానే ఉంటుంది. అక్కడే ఫ్లైవుడ్ దుకాణాలు ఉండటంతో.. నిత్యం జనసంచారంతో పాటు వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక.. పగటి పూట ఈ ఘటన మాత్రం జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేదని స్థానికులు చెప్తున్నారు. కాగా.. ప్రస్తుతం రోడ్డు కుంగిపోవటం కూడా సరిగ్గా షెటర్ల ముందు వరకు కూలిపోయింది.
ఇలానే గతంలోనూ 1980, 1990 సంవత్సరాల్లో కూడా ఈ నాలా కుప్పకూలిందని స్థానికులు చెప్తున్నారు. అఫ్సర్ సాగర్, గోషామహల్ పోలీస్ స్టేడియం, దారుసలాం, చాక్నవాడి, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ, అక్రమ నిర్మాణాలు, ఇష్టానుసారంగా నాలా ఆక్రమణల కారణంగా ఇప్పుడు నాలా తరచూ ఎక్కడికక్కడ కుంగిపోతోందని స్థానికులు వాపోతున్నారు. రాను రాను ఇంకెక్కడ కుంగిపోతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ నాలా రోడ్డుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు