Connect with us

Entertainment

సమంతపై త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజా పరిణామాలతో సమంత టాలీవుడ్‌ని వదిలేస్తుందా? అనే అనుమానాలు సినీ సర్కిల్స్‌లో. కెరీర్‌ ఆరంభంలో పూర్తిగా తెలుగు సినిమాలు, అప్పుడప్పుడు తమిళ సినిమాలు చేసిన సమంత గత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలు లేదా మరేంటో కానీ బాలీవుడ్‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. సమంత అంటే ఇప్పటికీ, ఎప్పటికీ అపారమైన అభిమానం చూపించే వారు తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది ఉన్నారు. వారందరూ సమంత తెలుగులో బిజీ బిజీగా మళ్లీ సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు, హీరోలకు జోడీగా కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలను సైతం పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే సమంత బాలీవుడ్‌లో కమిట్ అయిన సినిమాలు వచ్చే ఏడాది నుంచి బ్యాక్‌ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సౌత్‌లో మాత్రం ఇప్పటికే కమిట్ అయిన ఒకటి రెండు సినిమాలు సైతం ఎప్పటికి పూర్తి అయ్యి రిలీజ్ అవుతాయో అనే విషయమై ఎవరికీ క్లారిటీ లేదు. సమంత టాలీవుడ్‌లో సినిమాలు చేయడం కంటే ఎక్కువగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడంపై ఎక్కువ ఫోకస్ చేసిందని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సైతం అదే అభిప్రాయంను చెప్పేసారు. సమంత అప్పుడప్పుడు తెలుగు సినిమాలను సైతం చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించిన ‘జిగ్రా’ సినిమా తెలుగు వర్షన్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆలియా భట్‌తో పాటు హీరోయిన్‌ సమంత, దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఆ ఈవెంట్లో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. సమంత గారు పూర్తిగా ముంబైకి పరిమితం అవ్వకుండా, అప్పుడప్పుడు హైదరాబాద్‌ వచ్చి పోతూ ఉండాలని ఆయన కోరారు. తెలుగు లో సినిమాలు చేయాలని అడిగినప్పుడు సమంత స్పందిస్తూ తప్పకుండా మీరు మంచి కథలు రాస్తే నేను చేస్తానంటూ చెప్పుకొచ్చారు. మీరు తెలుగు సినిమాలు చేయరేమో అనే ఉద్దేశ్యంతో మేము మీ కోసం కథలు రాయడం లేదు అని అన్నారు.

మొత్తానికి సమంత తెలుగు సినిమాల్లో మంచి కథ వస్తే నటించే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇతర దర్శకులు ఏమో కానీ త్రివిక్రమ్‌ వంటి స్టార్‌ దర్శకుడు మంచి కథతో సమంతను అప్రోచ్‌ అయితే కచ్చితంగా సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ తో సినిమా కోసం రెడీ అవుతున్న త్రివిక్రమ్‌ తదుపరి సినిమాగా సమంతతో చేస్తాడేమో చూడాలి. ఒక వేళ అల్లు అర్జున్‌తో చేయబోతున్న భారీ సినిమాలో సమంతను హీరోయిన్ గా చేస్తారేమో చూడాలి. అల్లు అర్జున్‌, సమంత కాంబోలో గతంలో సినిమాలు వచ్చాయి. కాబట్టి మరోసారి వీరి కాంబినేషన్‌ని త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తే ఖచ్చితంగా అదో పెద్ద విషయం అవుతుంది. మరి త్రివిక్రమ్‌ ఆ సినిమాకు సమంతను అడగడం, ఆమె ఓకే అనడం జరుగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending