Entertainment
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ టీజర్ సిద్ధమైంది! దీపావళికి వస్తుందా?

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‘ టీజర్ సిద్ధమైంది! దీపావళికి వస్తుందా?
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్‘ సంక్రాంతి కానుకగా జనవరి 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా సందర్భంగా సినిమా నుంచి పాటను విడుదల చేసిన మేకర్స్, ప్రస్తుతం టీజర్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే టీజర్ కట్ పూర్తయిందట. దీపావళి కానుకగా టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీజర్ ఫైనల్ కట్కి చరణ్ ఇప్పటికే ఓకే చెప్పాడని, త్వరలో చిరంజీవికి కూడా చూపించాలనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది.
రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ దీపావళి కానుకగా ‘గేమ్ ఛేంజర్‘ టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దిల్ రాజు అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టీజర్ రెడీ అయిందని, తమన్ టీజర్కి అదిరి పోయే బీజీఎం ఇచ్చాడని సోషల్ మీడియాలో ట్వీట్లతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. టీజర్ ఫైనల్ వర్షన్ దాదాపు కన్ఫర్మ్ అయిందని, టీం మొత్తం ఎగ్జైటింగ్గా ఉన్నది అని తెలుస్తోంది.
టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచడానికి మేకర్స్ కష్టపడుతున్నారు. దర్శకుడు శంకర్ గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఈ సినిమాకి బజ్ కలగడం లేదు. అందుకే, టీజర్ ద్వారా బజ్ పెంచాలని చూస్తున్నారు. టీజర్ కోసం ప్రత్యేకంగా కొన్ని షాట్స్ తీసుకోవడంతో పాటు, బీజీఎం కూడా హైలైట్గా ఉండాలని థమన్ చూసాడు. రీ రికార్డింగ్ వర్క్‌తో పాటు ఫైనల్ మిక్సింగ్ బ్యాలన్స్ ఉన్న ఈ టీజర్ కట్స్ ను మేకర్స్ చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ఉంటుందని, అంచనాలు పెంచేలా టీజర్ ఉంటుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మంచి ఇమేజ్ పొందారు. అందువల్ల, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్కు జోడీగా అంజలి, యంగ్ పాత్రకు జోడీగా కియారా అద్వానీ కనిపించనున్నారు. శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, ఎస్ జే సూర్య వంటి చాలా ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో ఉంటారు. ఒక మంచి మెసేజ్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ దండిగా ఉండే ఈ సినిమా పక్కా సంక్రాంతి మూవీ అన్నట్లుగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. 2025 సంక్రాంతి సీజన్ విజేత గేమ్ ఛేంజర్ అంటూ ఇప్పటినుంచే మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచుతున్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు