Connect with us

Entertainment

చిరంజీవి ‘విశ్వంభర’ కోసం డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు.. ఏదో జరుగుతోందని తెలుస్తోంది! 

చిరంజీవివిశ్వంభరకోసం డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు.. ఏదో జరుగుతోందని తెలుస్తోంది! 

 chiranjeevi Reacts to Vishwambhara VFX Trolls: మెగాస్టార్చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలోవిశ్వంభరసినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న విశ్వంభర సినిమా నుంచి దసరా కానుకగా టీజర్ విడుదల చేయడం జరిగింది.టీజర్లోని విజువల్స్ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారని, కొన్ని షాట్స్లో వీఎఫ్ఎక్స్ పనితనం చాలా చెత్తగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలోవిశ్వంభరవీఎఫ్ఎక్స్పై ట్రోల్స్ జరుగుతున్నాయి. నేపథ్యంలో విశ్వంభర టీం వీఎఫ్ఎక్స్విషయంలో డ్యామేజ్ కంట్రోల్కి సిద్ధం అయ్యారని, టీం ను మారుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

 మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమావిశ్వంభర‘. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. వీఎఫ్ఎక్స్వర్క్ ఆలస్యం కావడంతో, ఇంకా షూటింగ్పూర్తికాకపోవడంతో సినిమాను సంక్రాంతి నుండి మార్చి, మే నెలలో సమ్మర్కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. ‘విశ్వంభరఅనే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమాకుబింబిసారఫేమ్వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్చూసిన తర్వాత, వశిష్ట సినిమాకు ఎంత వరకు న్యాయం చేస్తాడో అనే చర్చ మొదలైంది. టీజర్లోని విజువల్స్హాలీవుడ్రేంజ్లో ఉన్నాయనే చర్చ కూడా జరిగింది. 

 టీజర్లోని విజువల్స్హాలీవుడ్రేంజ్లో ఉండటమే కాదు, హాలీవుడ్సినిమాల నుండి కాపీ చేశారని, కొందరు సోషల్మీడియాలో సాక్ష్యాలతో పాటు షేర్చేస్తున్నారు.సోషల్మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ నేపథ్యంలో చిరంజీవి ఆలోచనలో పడ్డారనే వార్తలు వస్తున్నాయి. విశ్వంభర సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్గురించి చిరంజీవి ఆందోళనలో ఉన్నారని, ఆయన తన సన్నిహితులతో చర్చించి సినిమాకు మరో దర్శకుడిని తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. వశిష్ట కొత్త దర్శకుడు కావడంతో, అన్ని విషయాలను ఆయన సరిగా చూసుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే ఆయనపై ఒత్తిడి తగ్గించి బెస్ట్ఔట్పుట్వచ్చే విధంగా ఒక సీనియర్ దర్శకుడిని విశ్వంభర సినిమా కోసం రంగంలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో చిరంజీవి అండ్ టీం ఉన్నారట. 

 చిరంజీవికి సన్నిహితుడైన వి వి వినాయక్కు విశ్వంభర సినిమాలో వీఎఫ్ఎక్స్వర్క్బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి గత చిత్రాల ఫలితాలను చూస్తూ, ఎలాంటి అజాగ్రత్తగా ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే వీఎఫ్ఎక్స్పై విమర్శలు వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు. వినాయక్లేదా మరో దర్శకుడు వర్క్ చూసే అవకాశాలున్నాయి. 

Advertisement

విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతోంది. షూటింగ్ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ఉన్న సినిమాతో వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కీరవాణి చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాలో చిరంజీవి చెల్లెల్లు పాత్రలో ప్రముఖ హీరోయిన్స్ కనిపించబోతున్నారు. సంక్రాంతి సీజన్నుంచి తప్పుకున్నా బెస్ట్ఔట్పుట్తో సినిమాను తీసుకు రావాలని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. 

Loading

Trending