Connect with us

Entertainment

ప్రభాస్ హను కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ జన్మదినం సందర్భంగా బాహుబలి ప్రత్యేక భోజనం పంపించాడు.

ప్రభాస్, హను ప్రాజెక్ట్ కెమెరామెన్కు బాహుబలి భోజనం ఇచ్చారు.. అందరిని ఆకర్షించాలి. 

ప్రభాస్ హను కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ జన్మదినం సందర్భంగా బాహుబలి ప్రత్యేక భోజనం పంపించాడు. ప్రభాస్ తన టీం మెంబర్లకు స్పెషల్ ఫుడ్ను ప్రిపేర్ చేయిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాడు సుధీర్ ఛటర్జీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశాడట. ప్రభాస్ పంపిన భోజనాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు సుదీప్ ఛటర్జీ. 

అందులోని ఐటంలు చూసి నీళ్లు నమిలేస్తున్నారు. ప్రభాస్ ప్రేమతో ఫుడ్డు పెట్టి మనుషుల్ని చంపేస్తుంటాడు అని అంతా మాట్లాడుకుంటారు. తన టీంకు స్పెషల్గా ఫుడ్డుని ప్రిపేర్ చేసి సెట్స్ మీదకు తీసుకు వస్తాడు. రోజు సెట్లో తన టీంకు ఇంటి నుంచే ప్రత్యేకంగా వడ్డించి తీసుకువస్తాడు. ప్రభాస్ ప్రేమతో నిండుగా అన్నం పెట్టి పంపిస్తాడు. అందరూ కొట్టి చంపితే, ప్రభాస్ పెట్టి చంపుతాడు అని అందరూ అతని ఆతిధ్యం గురించి గొప్పగా చెబుతుంటారు. తాజాగా, ప్రభాస్ తన కెమెరామెన్ బర్త్ డే ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశాడు. 

ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశాడు మన డార్లింగ్. ఆయన బర్త్ డే అని తెలుసుకుని, బర్త్ డే డిన్నర్ అంటూ ప్రత్యేక వంటకాలు వండించి ఇంటికి పంపాడట. ఇక వంటకాలను చూసి సుదీప్ నోరెళ్లబెట్టేసినట్టుగా కనిపిస్తోంది. 

 ప్రభాస్ పంపించిన వంటకాలను ఫోటో తీసి ఇలాంటి రీతిలో నెట్టింట్లో పంచాడు. ప్రభాస్ ఆతిథ్యానికి మరోసారి బాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. సుదీప్ వేసిన పోస్ట్ కింద నెటిజన్లు చేసిన కామెంట్లు చూస్తే అది అర్థమవుతుంది. బాలీవుడ్ ప్రముఖులువావ్అని కామెంట్లు పెడుతున్నారు, మరికొంత మందిమా డార్లింగ్ అంతే ప్రేమతో భోజనం పెట్టి చంపేస్తాడుఅని అంటున్నారు. ప్రభాస్ ఆతిథ్యానికి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. 

Advertisement

ఇక ప్రభాస్ హను ప్రాజెక్ట్ కోసం టీం అంతా హైద్రాబాద్లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. తమిళనాడులో కొన్ని ప్రాంతాలు కూడా చూడాలని నిర్ణయించుకున్నారు. ఏడాది చివరికి ప్రాజెక్ట్ షూటింగ్కి వెళ్లేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తరువాత హను రాఘవపూడి ప్రాజెక్ట్కి సమయం ఇస్తాడు. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి రాజా సాబ్ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఆపై కల్కి 2, సలార్ 2 ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడతాడేమో చూడాలి. స్పిరిట్ గురించి అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ రావడం లేదు. 

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending