Connect with us

Entertainment

ట్రెండింగ్‌లో ఉంచినందుకు ధన్యవాదాలు. జానీ మాస్టర్ అకౌంట్ నుండి పోస్ట్. 

 ట్రెండింగ్లో ఉంచినందుకు ధన్యవాదాలు. జానీ మాస్టర్ అకౌంట్ నుండి పోస్ట్. 

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఇటీవల బెయిల్ఇచ్చారు. జైలు నుంచి బెయిల్పై బయటకు రాకముందే ఆయన సోషల్ మీడియా అకౌంట్ద్వారా ఒక పోస్ట్ చేశారు. పోస్ట్లో తాను కొరియోగ్రఫీ చేసిన భూల్భులయ్యా 3 టైటిల్ ట్రాక్‌ “హరే రామ్హరే రామ్‌” ట్రెండింగ్లో ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు అని వీడియోను షేర్చేశారు. బెయిల్వచ్చిందని తెలిపిన తర్వాత జానీ మాస్టర్అకౌంట్ నుంచి వచ్చిన మొదటి పోస్ట్కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. 

 తన అసిస్టెంట్ను చాలా కాలం పాటు అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్కు కోర్టు బెయిల్మంజూరు చేసింది. పోక్సో కేసు నమోదు కావడంతో బెయిల్రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, అధికారులు జానీ మాస్టర్ను పలు సార్లు విచారించారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు జానీ మాస్టర్కి బెయిల్మంజూరు చేసింది. తప్పని సరిగా కోర్టుకు హాజరు అవ్వడంతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేసే విధంగా మాట్లాడటం, ఇతర ప్రయత్నాలు చేయడం వంటివి చేయకూడదు అనే కండీషన్స్తో కోర్టు బెయిల్మంజూరు చేయడం జరిగిందట. 

 జానీ మాస్టర్తల్లి అనారోగ్యం కారణంగా బెయిల్మంజూరు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద, చాలా రోజుల జైలు జీవితం నుంచి జానీ మాస్టర్కు బెయిల్లభించింది. అయినా ఆయన తిరిగి తన పని మొదలు పెట్టే అవకాశాలు ఇప్పట్లో లేవని తెలుస్తోంది. పుష్ప 2 ఐటం సాంగ్ కోసం జానీ మాస్టర్కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది. కానీ ఆయన్ను తప్పించామని, వేరే వారితో పాటకు కొరియోగ్రఫీ చేయిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాల నుంచి ఆయన్ని తప్పించే అవకాశాలు ఉన్నాయి. జానీ మాస్టర్ను తిరిగి పుంజుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 

 బెయిల్వచ్చిందనే వార్తలు రావడం.. మరో వైపు ఆయన ఖాతా నుంచి పోస్ట్ రావడంతో ఒక్కసారిగా ట్రెండ్ అయింది. హిందీ మూవీ భూల్భులయ్యా 3 సినిమాలోని టైటిల్ట్రాక్హరే రామ్హరే రామ్పాటకి జానీ మాస్టర్కొరియోగ్రఫీ అందించారు. పాట ప్రస్తుతం సోషల్మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంది. యూట్యూబ్లో సెన్షేషన్క్రియేట్చేస్తున్న పాటే మేకింగ్ వీడియోను జానీ మాస్టర్ ఇన్స్టాగ్రామ్ద్వారా ఆయన టీం షేర్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే బెయిల్ వస్తే కూడా ఇంకా ఆయన బయటకు రాలేదని తెలుస్తోంది. నేటి సాయంత్రం లోపు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

 తన సాంగ్ను ట్రెండింగ్లో ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు అని భూల్భులయ్యా 3 సినిమాకు సంబంధించిన యూనిట్సభ్యులను ట్యాగ్ చేశారు. జానీ మాస్టర్షేర్ చేసిన వీడియోను కొన్ని గంటల్లోనే లక్షల మంది చూశారు, 40,000 మందికి పైగా లైక్లు మరియు షేర్స్ చేసారు. జానీ మాస్టర్పై కొందరు విమర్శలు చేస్తున్నా, కొందరు మాత్రం ఆయన నిజాయితీని నమ్ముతున్నారు. 

Loading

Trending