Entertainment
టాలీవుడ్ మీద బండ్ల గణేష్ కౌంటర్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను..

టాలీవుడ్ మీద బండ్ల గణేష్ కౌంటర్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు (నవంబర్ 8) సందర్భంగా టాలీవుడ్ నుంచి దర్శకులు, నిర్మాతలు, హీరోలు విషెస్ ఇవ్వలేదు. అయితే, తాము నచ్చిన, మెచ్చిన చంద్రబాబు పుట్టిన రోజు అయితే ఎగబడిపోని విషెస్ చెప్తుంటారు. రేవంత్ రెడ్డి విషయానికి వచ్చే సరికి మాత్రం చాలా మంది మౌనంగానే ఉండిపోయారు. దీనిపై బండ్ల గణేష్ కౌంటర్ వేశాడు.
టాలీవుడ్ దాదాపు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎం లతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ జగన్ సీఎం అయ్యే వరకు టాలీవుడ్ ఏపీ వైపు అంతగా చూసి మాట్లాడలేదు. అప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ వెంట టాలీవుడ్ నడిచింది. కేటీఆర్ ఆర్డర్లతో టాలీవుడ్ నడిచినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. టాలీవుడ్ పెద్దలు, టాప్ దర్శకులు, నిర్మాతలు చంద్రబాబు నాయుడు నచ్చతారు. ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువగా ఏపీ వైపు చూస్తోంది. అదనంగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్‌కు అంతగా అనుకూలంగా లేదు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదంతో రేవంత్ రెడ్డి టాలీవుడ్‌పై ఎలా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది.
చిరంజీవి వంటి వారు మాత్రం స్నేహపూర్వకంగా విషెస్ ఇచ్చారు. కానీ చాలా మంది సినీ పెద్దలు, దర్శకులు, నిర్మాతలు మౌనంగా ఉన్నారు. ఇందులో బండ్ల గణేష్‌కి కోపం వచ్చింది. టాలీవుడ్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. “గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. ‘టికెట్ రేట్లు పెంచడానికి మాత్రమే సీఎం కావాలి’ అని వ్యంగ్యంగా చెప్పాడు. బండ్ల చేసిన ఈ ట్వీట్‌కు పెద్ద రెస్పాన్స్ వస్తోంది. అంటే టాలీవుడ్ పెద్దలకు టికెట్ రేట్లు పెంచుకోవాడినికి సీఎం రేవంత్ రెడ్డి అవసరం కానీ.. ఆయన పుట్టిన రోజున విష్ చేయడానికి మాత్రం నోరు రాదా? అంటూ కౌంటర్లు వేశాడు. మరి ఇలాంటి వైఖరితో టాలీవుడ్ ఉంటే.. మున్ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉందనిపిస్తోంది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు