Entertainment
గేమ్ చేంజర్ సాంగ్.. అంజలి లీక్ చేసినట్టేనా?

గేమ్ చేంజర్ సాంగ్.. అంజలి లీక్ చేసినట్టేనా?
గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన హడావిడి ఇప్పుడు మళ్లీ తగ్గినట్టు అనిపిస్తుంది. దసరాకు టీజర్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లారు. టీజర్ వచ్చి ఉంటే లెక్కలు వేరేలా ఉండేవి. ఇప్పటికి అయితే రా మచ్చా మచ్చా అనే పాట బాగానే ట్రెండ్ అవుతోంది. హీరో డ్యాన్స్ మూమెంట్స్ అంతగా లేకపోయినా కూడా శంకర్ గ్రాండియర్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. అక్టోబర్ చివర్లో పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
హీరో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా గేమ్ చేంజర్‌ను సంక్రాంతికి రిలిజ్ దిల్ రాజు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రాబోయే next పాట ఎలా ఉంటుందో అంజలి చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ పాటల మీద చాలా మందికి intrest లేదనా సంగతి తెలిసిందే. జరగండి అనే పాట లీక్ అయి ట్రోలింగ్ అవ్వుతూ ఉంది . ఆ పాట కూడా జనాలో అంతగా హిట్ అవ్వలేదు. రా మచ్చా మచ్చా పాట ట్యూన్, బాణీ ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ చరణ్ డ్యాన్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు.
గేమ్ చేంజర్ నుంచి దసరాకి రావాల్సిన టీజర్ రాలేదు. అక్టోబర్‌లోనే టీజర్, మూడో పాట రిలీజ్ చేస్తామని దిల్ రాజు అన్నాడు. కానీ దసరాకి టీజర్ పనులు పూర్తి కాలేదని సమాచారం. దీంతో ఎప్పటిలానే టీజర్ వాయిదా పడింది. అలా ఫ్యాన్స్ దెబ్బకు డీలా పడిపోయారు. అక్టోబర్ చివరి వారంలో మూడో పాటను రిలీజ్ చేస్తామని అన్నారు. అక్టోబర్ 30న అంటే దీపావళి రోజున మూడో పాట రావాల్సి ఉంది.
న్యూజిలాండ్‌లో షూట్ చేసిన డ్యూయెట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం. కియారా, రామ్ చరణ్ కాంబోలో ఈ సాంగ్ ఉంటుందని టాక్. అయితే మరో వైపు అంజలి, రామ్ చరణ్ కాంబోలో షూట్ చేసిన పాట విడుదల చేస్తారని అంటున్నారు. ఈ పాట వింటేజ్ మోడ్‌లో ఉంటుందని టాక్. 1990, 80లోకి తీసుకెళ్లేలా ఈ పాటను డిజైన్ చేశారని తెలుస్తోంది.
ఒకే ఒక్కడు మూవీలోని నెల్లూరి నెరజానాలా ఈ పాట ఉంటుందని అప్పుడే రీల్స్ వచ్చేశాయి. రామ్ చరణ్, అంజలిలను పెట్టి ఈ పాటతో ఎడిట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చివరకు అంజలి వరకు చేరుకున్నాయి. ఈ ఎడిట్ వీడియోలని కూడా అంజలి తన ఇన్ స్టాలో పెట్టేసుకుంటోంది. అంటే గేమ్ చేంజర్ పాట కూడా ఇలానే ఉంటుందని చెప్పకనే చెప్పి అలా హింట్ ఇచ్చేసిందన్న మాట.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు