Connect with us

Entertainment

పుష్ప 2 హైదరాబాద్‌ ఈవెంట్‌కి ట్విస్ట్ వచ్చింది. వివరాలు ఇవే.

పుష్ప 2 హైదరాబాద్‌ ఈవెంట్‌కి ట్విస్ట్ వచ్చింది. వివరాలు ఇవే.

అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’తో మరో వారం రోజుల్లో సెన్సేషన్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా పుష్ప 2కి పెద్ద హడావుడి ఉంది. బీహార్‌తో పాటు అన్ని చోట్ల పుష్పరాజ్‌కి అద్భుత స్వాగతం లభిస్తోంది. హైదరాబాద్‌లో పుష్ప రాజ్‌ ఈవెంట్‌ ఎలా ఉంటుందో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని అనుకున్నారు. కానీ చివరిలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చి ఈ ఈవెంట్‌ను డిసెంబర్‌ 1న మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించాలని నిర్ణయించారు.

అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున 11500 స్క్రీన్‌లలో రిలీజ్‌ చేయబోతున్నారు. మొదటి రోజు వసూళ్లు కొత్త రికార్డులు క్రియేట్‌ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి ప్రమోషన్స్‌ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.

పుష్ప 2 సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ బీహార్‌లో జరిగింది. పాట్నాలో జరిగిన ఈవెంట్‌కు రెండు లక్షల మంది హాజరైనట్లు సమాచారం. తరువాత చెన్నై, కొచ్చీలో జరిగిన ఈవెంట్‌లకు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అందుకే పుష్ప 2 ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో, ఎన్ని లక్షల మంది వస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని రోజులుగా యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లో భారీ ఓపెన్‌ ప్లేస్‌లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగబోతుందని వార్తలు వచ్చాయి.

ముందు రామోజీ ఫిల్మ్‌ సిటీ మెయిన్‌ గేట్‌ వద్ద భారీ ఓపెన్‌ ప్లేస్‌లో రికార్డ్‌ స్థాయి జనాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. చివరికి పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మల్లారెడ్డి కాలేజ్‌లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని మల్లారెడ్డి కాలేజ్‌ ఉత్తమం అన్న నిర్ణయానికి మైత్రి మూవీ మేకర్స్‌ వచ్చారట.

డిసెంబర్‌ 1న ఈవెంట్‌ జరగనుందని తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజ్‌ గ్రౌండ్స్‌లో డిసెంబర్‌ 1న జరిగే ఈ ఈవెంట్‌లో సుకుమార్ పాల్గొంటారు. సినిమా అంచనాలు పెంచేందుకు ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బన్నీ ముంబై వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తూ రేపు తిరిగి హైదరాబాద్‌ వస్తాడు. ఫస్ట్ డే వసూళ్లు రికార్డ్‌ స్థాయిలో ఉండేలా బజ్, హైప్ ఏర్పడింది.

Advertisement

Loading

Trending