Connect with us

Andhra Pradesh

కోనసీమ కుర్రాడు, కెనడా అమ్మాయితో పెళ్లి.. ఇక ఆ ఊర్లో సందడే సందడి..

తెలుగు రాష్ట్రాల నుంచి యువత విదేశాలలో ఉద్యోగాలు మరియు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. అక్కడి అమ్మాయిలతో, అబ్బాయిలతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిలను ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు యువకుడి ప్రేమ కథ విదేశాలలో జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అబ్బాయి కెనడా అమ్మాయిని ప్రేమించి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యాడు. ఈ ప్రేమ పెళ్లికి కోనసీమ వేదికగా నిలిచింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలానికి చెందిన మనోజ్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. 14 ఏళ్ల క్రితం ఉన్నత చదువులకు కెనడా వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఆయనకు ఉద్యోగం కూడా వచ్చింది. మనోజ్ ప్రస్తుతం అక్కడే బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన చదువుకునే రోజుల్లో కెనడాకు చెందిన ట్రేసి రోచెడాన్‌తో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ఇద్దరు ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు.. వీరి ప్రేమ ఏడేళ్లుకొనసాగింది.. చివరికి ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించారు.

ఇటీవల కెన్యాలో మనోజ్, ట్రేసి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు.. ఆ వెంటనే కెనడాలో వివాహం చేసుకున్నారు. అయితే మనోజ్ హిందూ సంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు రెండు రోజుల క్రితం సొంత ఊరు ఈదరపల్లి వచ్చారు. సోమవారం పెళ్లికొడుకు, పెళ్లికూతురు చేసే వేడుక, హల్దీని ఘనంగా నిర్వహించారు. ఈ వారంలో దిండిలో పెళ్లి జరుగుతోంది. 8న రిసెప్షన్ చేయనున్నారు అని మనోజ్ కుటుంబ సభ్యులు చెప్పారు.

మనోజ్ కుమార్ పెళ్లి వేడుకలో విదేశీ అతిథులు కూడా ఉన్నారు. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ పెళ్లికి వచ్చారు. వీరంతా కోనసీమ అందాల్ని చూసి మైమరిపోతున్నారు. ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని.. ఇక్కడ పల్లెటూరి వాతావరణం ఎంతో నచ్చింది అంటున్నారు. మొత్తం మీద, మనోజ్ కుమార్ మరియు కెనడా అమ్మాయి ట్రేసి రోచెడాన్ పెళ్లితో ఈదరపల్లిలో చాలా సందడి వాతావరణం ఉంది.

Advertisement

Loading

Trending