Connect with us

Telangana

దివ్యాంగ గాయకురాలికి తమన్ అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో RTC MD సజ్జనార్ కృతజ్ఞతలు చెప్పారు.

దివ్యాంగ గాయకురాలికి తమన్ అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో RTC MD సజ్జనార్ కృతజ్ఞతలు చెప్పారు.

ఇటీవల ఆర్టీసీ బస్సులో ఒక అంధ యువకుడు చాలా మంచి పాట పాడిన విషయం తెలిసిందే. అతడి మధుర గాత్రంతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దివ్యాంగ సింగర్‌కు ఒక అవకాశం కల్పించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఆ యువకుడికి అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆహా ఛానెల్‌లో తెలుగు ఐడియల్ సీజన్ 4లో అతడితో కలిసి పాట పాడడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఎండీ సజ్జనార్, ఇటీవల ఓ అంధ యువకుడి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ చక్కగా పాటలు పాడాడు. శ్రీ ఆంజనేయం మూవీలోని ‘రామ రామ రఘురామ’ పాటను అద్భుతమైన తన గాత్రంలో ఆలపించి బస్సులో ఉన్న వారిని అలరించాడు. అతని పాటను విన్న ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు. అతడు పాట పాడుతూ ఉండగా, ఒక వ్యక్తి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు చేరగా, దివ్యాంగ సింగర్‌ పై ప్రశంసలు తెలిపారు. అతడికి అవకాశం ఇవ్వాలని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేకంగా కోరారు. ‘మనం చూడాలే కానీ, ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా! “కీరవాణి సర్, ఒక అవకాశం ఇవ్వండి” అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో సజ్జనార్ ట్వీట్‌కు తాజాగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. అంధ యవకుడికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఐడియల్ సీజన్ 4లో ఆ యువకుడు పాల్గొనేలా చూడాలని ఆహా టీమ్‌ను కోరారు. ఆహా వేదిక మీద అతడితో కలిసి ప్రదర్శన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. “ఆ యువకుడికి టాలెంట్ ఉంది. తెలుగు ఐడియల్ సీజన్ 4లో అతను ప్రత్యేక ప్రదర్శన ఇస్తాడు. ఆహా టీమ్‌కు.. ఇది విజ్ఞప్తి అనుకోండి, లేదా ఆర్డర్ అనుకోండి. అతడికి అవకాశం ఇవ్వండి. నేను ఆహా వేదికపై అతడితో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా. అతడిలో చక్కటి టాలెంట్ ఉంది. పర్ఫెక్ట్ పించింగ్‌లో అద్భుతంగా పాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు. ఆ యువకుడికి మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి. “అందుకే మేము సిద్ధంగా ఉన్నాం” అని ట్విట్టర్‌లో రాశారు.

తమన్ ప్రకటన పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మట్టిలో మాణిక్యానికి అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా తమన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశంతో తన అద్భుతమైన ప్రతిభకు మరింత గుర్తింపు లభిస్తుందని ట్వీట్ చేశారు. ‘అద్భుత‌మైన కంఠంతో పాట‌లు ఆల‌పిస్తోన్న ఈ అంధ యువ‌కుడికి ఆహా నిర్వహిస్తోన్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో తన అద్భుతమైన ప్రతిభకు మరింత గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో తన మధుర గాత్రంతో చాలా మందిని మాయచేస్తూ ఈ యువకుడు ఎంతో ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Loading

Advertisement

Trending