Connect with us

Telangana

నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు ఎప్పుడు తెరవాలో తెలియని బంద్‌ ప్రారంభమైంది. కారణం ఇదే..!

నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు ఎప్పుడు తెరవాలో తెలియని బంద్‌ ప్రారంభమైంది. కారణం ఇదే..!

నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ అవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని యాజమాన్య సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. సెమిస్టర్ పరీక్షల్ని కూడా నిర్వహించమని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం తెలిపింది.

తెలంగాణలోని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్‌ కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో సంఘం నేతలు బొజ్జ సూర్యనారాయణరెడ్డి, యాద రామకృష్ణలు బంద్‌కు పిలుపు ఇచ్చారు. నిధులు లేకపోవడం వల్ల కాలేజీలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని వారు వాపోయారు.

ఈ ఏడాది దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరి వరకు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో కాలేజీలను బంద్ చేస్తున్నామని చెప్పారు. గతంలో అక్టోబర్ 14 నుంచి 17 వరకు కాలేజీలు మూసివేసినప్పుడు విద్యా శాఖ అధికారి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దాంతో తరగతులు నిర్వహించామని, ఈసారి డబ్బులు విడుదల చేసేంత వరకు కాలేజీలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఇక మాటలు వినే పరిస్థితుల్లో లేమని.. పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు యాజమాన్య సంఘాలు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను పట్టించుకోవడం లేదని సంఘం నేతలు సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను కలిసేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని వారు బాధపడ్డారు.. 90 శాతం కాలేజీల యాజమాన్యాలు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

కాగా, కాలేజీల బంద్‌ ప్రభావం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపై పడనుంది. డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు ఈ వారంలో జరిగే ఉన్నాయి.  ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు నేడు మొదలయ్యాయి. మహత్మాగాంధీ యూనివర్సిటీ యొక్క పరీక్షలు ఈనెల 21 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీల పరీక్షలు ఈనెల 26 నుండి మొదలవుతాయి. శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల సెమిస్టర్‌ పరీక్షలు కూడా ఈ నెలలో జరగాలి. నెలాఖరికి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మొదలవుతాయి. అయితే కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునివ్వటంతో వాటి ప్రభావం పరీక్షలపై పడనుంది.

Advertisement

Loading

Trending