Telangana
‘తెలంగాణ హెరిటేజ్ వీక్’ పేరుతో సంబురాలు అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు..

‘తెలంగాణ హెరిటేజ్ వీక్’ పేరుతో సంబురాలు అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు..
బతుకమ్మ అంటేనే పూల సంబురం పువ్వులని ఒక్కదగ్గరా పేర్చి గౌరమ్మని పూజిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు తెలంగాణలోనే కాకుండా అమెరికాలోని పలు రాష్ట్రాలు అధికారికంగా గుర్తించాయి. తెలంగాణ హెరిటేజ్ వీక్ పేరుతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నాయి. ఈ మేరకు వర్జీనియా, జార్జియా,నార్త్ కరోలినా, రాష్ట్రాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో.. తెలంగాణ పూల పండుగ అయిన బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సూచిక.. తెలంగాణకు మాత్రమే సొంతమైన పూల కేళిక.. బతుకమ్మ పండుగ. పూలను పూజించే అత్యంత అరుదైన సంబురం బతుకమ్మ. శక్ష ప్రకృతిలోనే పరమాత్మున్ని చూసుకుని.. పూలనే గౌరమ్మగా భావించి.. చేసుకునే తొమ్మిదిరోజుల మహా ఉత్సవం బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ పండగ వారంగా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి కూడా. ఈ మేరకు.. ఆయా స్టేట్ల గవర్నర్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. బతుకమ్మ పండుగ ప్రశస్త్యం ఖండాంతరాలు దాటినట్టయింది.
బతుకమ్మ పండుగ అనేది ఎంతో ప్రత్యేకమైన, ప్రాముఖ్యత ఉన్న పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా అమెరికాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాలేహ్ మేయర్లలు, నార్త్ కరోలినాలోని ఛార్లెట్, అభివర్ణించారు. బతుకమ్మ అనేది.. ప్రకృతికి మానవజాతికి మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను తెలియజేసే అద్భుతమైన సంబురమని కొనియాడారు. తెలంగాణ సమాజం నార్త్ కరోలినాకు ఎంతో కంట్రిబ్యూట్ చేసిందని తెలిపారు.ఈ క్రమంలోనే.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ పండుగను అక్టోబర్ 01 నుంచి 09వ తేదీ వరకు అధికారికంగా జరుపుకోవాలని అక్కడి ప్రజలకు సూచించారు.
తెలంగాణలోని ప్రజలు విశ్వవ్యాప్తంగా విస్తరించారు. లండన్, పారిస్, బ్రిటన్, దుబాయి, అమెరికా,సౌదీ అరేబియా ఇలా అన్ని దేశాల్లో తెలంగాణవాసులు స్థిరపడ్డారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి సంస్కృతిని సంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోకుండా పాటిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైంది. ముఖ్యంగా తెలంగాణ జాగృతితో పాటు తానా, మాటా లాంటి తెలుగు ఎన్నారైల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్స్ కూడా ఆయా దేశాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వేడుకలకు అక్కడ నివసిస్తున్న తెలుగువారి నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో.. అక్కడి ప్రభుత్వాలు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటం గమనార్హం.
అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో తెలుగువారు స్థిరపడగా.. అందులో తెలంగాణ ప్రజలు కూడా గణనీయంగా ఉండటం వల్ల తెలంగాణకు మాత్రమే సొంతమైన బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడి సంప్రదాయాలను అమెరికాలో కూడా పాటించారు. అందువల్ల అమెరికాలోని పలు రాష్ట్రాలు.. బతుకమ్మ ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు