Connect with us

Telangana

మరొక అల్పపీడనం రానుంది.. ఈ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం!

మరొక అల్పపీడనం రానుంది.. ఈ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం!

తెలంగాణ వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ముఖ్యమైన సమాచారం ఇచ్చారు. నేడు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. వర్షాలకు ఛాన్స్ లేదని చలి తీవ్రత పెరుగుతుందన్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో సముద్రంలో ఓ చిన్న తుఫాను వచ్చే అవకాణం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పారు.

ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఈనెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా చేరుతుందని అంచనా. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

తెలంగాణలో నేటి వాతావరణం గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ముఖ్యమైన సమాచారం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతానికి వానలు పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. బంగాళాఖాతం ప్రశాంతంగా ఉందని.. మేఘాలు కూడా లేవని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు ఎక్కడా వర్షాలు పడే ఛాన్స్ లేదన్నారు. కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. గాలి వేగం తెలంగాణలో మాగ్జిమం గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుందన్నారు. బంగాళాఖాతం నుంచి గాలి వేగం పెరుగుతోందని..అరేబియా సముద్రంలో ఒక ఆవర్తనం ఏర్పడుతోంది అది గాలులను తనవైపు లాక్కుంటోందని చెప్పారు.

ఉష్ణోగ్రత విషయానికి వస్తే, నేడు తెలంగాణలో గరిష్ఠంగా 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పారు. చల్లని గాలుల వల్ల ఎండ వేడిగా ఉన్నట్లు అనిపించదన్నారు. తేమ తగ్గిపోయిందని, తెలంగాణలో 40 శాతం కంటే తక్కువగా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో చలి తీవ్రత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్‌కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చటి ఉన్ని దుస్తులు ధరలించాలని.. వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండొచ్చని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Loading

Trending