Connect with us

Telangana

వాట్సాప్‌లో పెండ్లి పత్రిక డౌన్‌లోడ్ చేస్తున్నారా? ఇది ఒక మోసం. జాగ్రత్తగా ఉండండి, డబ్బులు పోయే అవకాశం ఉంది!

వాట్సాప్‌లో పెండ్లి పత్రిక డౌన్‌లోడ్ చేస్తున్నారా? ఇది ఒక మోసం. జాగ్రత్తగా ఉండండి, డబ్బులు పోయే అవకాశం ఉంది!

వాట్సాప్‌లో వచ్చే పెండ్లి ఆహ్వాన పత్రికలు డౌన్‌లోడ్ చేస్తున్నారా..? అయితే మీరు డేంజర్ జోన్‌లో చిక్కుకున్నట్లే. మీ ఖాతా ఖాళీ అవ్వటం ఖాయం. కొత్త నంబర్ల నుంచి వచ్చే లింకులు, ఫైళ్లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు ఆహ్వాన పత్రికల పేరుతో లింకులు పంపుతున్నారని.. లింకు క్లిక్‌ చేయగానే ఏపీకే ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుందని చెబుతున్నారు. ఈ యాప్‌లు మన ఫోన్‌లోని డేటాను నేరగాళ్ల సర్వర్‌కు పంపిస్తాయి. దానిని క్లిక్‌ చేస్తే ఫోన్‌ డేటా నేరగాళ్ల చేతుల్లో పడుతుందని అంటున్నారు.

మునుపు ఇంట్లో పెళ్లి ఉంటే, బంధువులు, తెలిసినవారు ఎంత దూరంలో ఉన్నా ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేవారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. ఇప్పుడు డిజిటల్ ఆహ్వాన పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే చోటు చూపించే గూగుల్ మ్యాప్స్ లింక్‌ని వాట్సాప్ ద్వారా పంపించి ఆహ్వానిస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్లకుండా సోషల్ మీడియాలోనే పంపిస్తున్నారు. వారు కూడా అవేవీ పట్టించుకోకుండా వాట్సాప్ ఆహ్వాన పత్రికతోనే వేడుకలకు హాజరవుతున్నారు. అయితే ఇదే అదనుగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో మోసపూరిత మెసేజ్‌లు, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ (IPK) ఫైళ్లు పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆహ్వాన పత్రికలు, డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు, ఫైళ్లను సైబర్ కేటుగాళ్లు పంపిస్తారు. వాటిని ఎవరు పంపారో తెలుసుకోవాలనే ఆసక్తితో మనం క్లిక్‌ చేస్తాము. ఇలా చేయగానే మన ఫోన్‌లోకి ఏపీకే ఫైల్ రూపంలో యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ యాప్‌ ద్వారా మన గ్యాలరీ, యాప్‌ల డేటా వంటి అన్ని అనుమతులను మాల్‌వేర్‌ హ్యాక్‌ చేస్తుంది. ఆహ్వాన పత్రిక లేదా వీడియో అనుకుని డౌన్‌లోడ్‌ చేస్తే, హ్యాకింగ్‌కి సంబంధించిన యాప్స్ ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఫోన్‌ సైబర్ నేరస్తుల చేతుల్లో పడుతుంది. తర్వాత మన అకౌంట్లలోని డబ్బులు ఖాళీ చేస్తారు. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత ఫోటోలను సేకరించి బెదిరించడం వంటి పనులు కూడా చేస్తారు.

గుర్తు తెలియని ఫోన్‌ నంబర్ల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు, ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోని సైబర్‌ ఉచ్చులో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. మన ఫోన్‌కు ఏదైనా ఫైల్ వస్తే, ఆ ఫైల్ చివరి అక్షరాలు దాని రకాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు, వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ పంపితే, అది ‘వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.పీడీఎఫ్‌’ అని ఉంటుంది. అలాంటి ఫైళ్లతో సమస్య ఉండదని అంటున్నారు. కానీ, చివర్లో APK ఫైల్‌ అయితే, అది ‘వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.APK’ అని ఆంగ్ల అక్షరాల్లో ఉంటుంది. APK ఫైల్‌ అయితే దానిని డౌన్‌లోడ్ చేయకూడదని సూచిస్తున్నారు. అందుకే, తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌ అయినా, ముందు పరిశీలించి తగిన జాగ్రత్తలతోనే ఓపెన్‌ చేయాలని చెబుతున్నారు.

Loading

Advertisement

Trending