Telangana
కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు ప్రబుత్వ చర్యలు ఇందుకుగాను 70 లక్షల నిధులు మంజూరు

కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్.. 70 లక్షల నిధులు మంజూరు
తెలంగాణలో రోజు రోజుకు వీధి కుక్కల బెడద పెరిగిపోతుంది. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా కుక్కలు చేస్తున్న దాడులు కూడా పెరిగిపోతున్నాయి. జనాలు రోడ్ల మీద వెళ్లాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుక్కల సంఖ్య నియంత్రించే పనులో జగిత్యాల అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా.. 5000 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఇందుకు ప్రభుత్వం ఏకంగా.. 70 లక్షల నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వీధి కుక్కల బెడద చాలా పెరిగిపోతోంది. నిత్యం ఏదో ఓ చోట.. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా వీధి కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ వీధి కుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడితే.. మరికొంతమంది బుజ్జాయిలు ప్రాణాలు వదిలిన విషాదకర ఘటనలూ ఉన్నాయి. దీంతో.. వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున పిర్యాదులు వస్తుండగా.. అధికారులు మాత్రం ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా.. జగిత్యాలలో కుక్కల సంఖ్యను తగ్గించేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగారు.
మున్సిపాలిటీలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో.. జగిత్యాల జిల్లా అడికారులు కుక్కల సంతానం ఎక్కువ అవ్వకూడదని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని ఇందుకోసం మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.70 లక్షల నిధులు మంజూరు చేశారు. ఒక్కో కుక్కకు గాను రూ.1400 చొప్పున 5000 కుక్కలకు రూ.70 లక్షల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.
ఈ వ్యవహారంపై పట్టణవాసులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పట్టణంలో మొత్తం సుమారు 2000 కుక్కలు మాత్రమే ఉంటాయని.. అందులోనూ కుటుంబ నియంత్రణ చేసేది మగ కుక్కలకే అయితే 5000 కుక్కలు ఎక్కడ నుంచి వచ్చాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దగ్గర కూడా డబ్బులు తింటున్నారా అంటూ.. జగిత్యాల పట్టణ వాసులు మండిపడుతున్నారు. డబ్బులు తిన్నా సరే.. కుక్కలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి మంచి పని చేశారంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. మిగతా పట్టణాల్లో కూడా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయని.. అందులోనూ రాత్రుల్లో వాటి బెడత మరింత ఎక్కువైందని ప్రజలు వాపోతున్నారు. కుక్కల భయంతో చిన్నపిల్లలను రోడ్డు మీదికి పంపాలంటే వణికిపోతున్నామని.. పిల్లలే కాకుండా పెద్దలను కూడా కుక్కలు వదిలిపెట్టటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు