Telangana
gang rape ఇద్దరు బాలికలపై ఐదుగురు గ్యాంగ్ రేప్ హైదరాబాద్‌లో అమానుష ఘటన..

ఇద్దరు బాలికలపై ఐదుగురు గ్యాంగ్ రేప్ హైదరాబాద్‌లో అమానుష ఘటన..
దేశంలో బాలికల పై చిన్నారుల పై మహిళల పై , అఘాయిత్యాలకు అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కొందరు మృగాళ్లలా వారిపై అత్యాచారానికి పాల్పడుతునరు . తాజాగా, ఓ ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. బస్టాండు వద్ద ఉన్న ఇద్దరి బాలికల కు ఆశ్రయం కల్పిస్తామని వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆశ్రమంలో దింపుతామని చెప్పిన ఒక ముగ్గురు వారి పై ఇద్దరు పశువుల్లా ప్రవర్తించారు.
పారిపోయిన ఇద్దరు బాలికలపై మృగాళ్లు సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని యువకులను అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. IS సదన్ డివిజన్ పరిధిలో ఓ ప్రయివేట్ సంస్థ.. బాలికల కోసం ఓ(ఆశ్రమం ) పునరావాస కేంద్రాన్ని నడుపుతోంది. ఈ కేంద్రంలో జనగామ ప్రాంతానికి చెందిన ఓ బాలిక మూడు నెలల నుంచి ఆశ్రయం పొందుతుండగా.. గత నెల 18న మల్కాజిగిరికి చెందిన మరో బాలిక ఆశ్రయం లో చేరింది. వారికి తల్లిదండ్రులు ఉన్నా, వేరు వేరు కారణాలతో బాలికలను ఆశ్రమంలో చేర్పించారు.
ఈ క్రమంలో బాలికల మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని ఇద్దరూ సెప్టెంబరు 24న కిటికీ నుంచి దూకి తప్పించుకున్నారు. దీని గురించి సైదాబాద్ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. సెప్టెంబరు 24 న రాత్రి 8 గంటలకు బాలికులు ఇద్దరూ జనగామ చేరుకున్నారు. అక్కడ బస్టాండ్ సమీపంలో పాన్‌షాప్ నడుపుతోన్న యువకుడు సాయిదీప్ అనే అతని దగ్గర ఫోన్ తీసుకున్న ఓ బాలిక తనకు తెలిసిన యువకుడు నాగరాజుకు ఫోన్ చేసింది. అక్కడకు వచ్చిన అతడు.. ఆ బాలికను ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తన స్నేహితురాల్ని నాగరాజు అనే వ్యక్తి తీసుకెళ్లడంతో బస్టాండ్ దగ్గర మరో బాలిక ఒంటరిగా మిగిలింది. దీన్ని గమనించిన పాన్ షాప్ సాయిదీప్ ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని నమ్మించి పక్కనే ఉన్న బేకరీ లోకి తీసుకెళ్లి.. బేకరీ నిర్వాహకుడు రాజుతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాగరాజు తీసుకెళ్లిన బాలికను సెప్టెంబరు 25న ఉదయం తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర వదిలిపెట్టాడు.
ఆ బాలికల గురించి విషయం తెలుసుకున్న సాయిదీప్, రాజుల స్నేహితులు అఖిల్, రోహిత్లు వారిని హైదరాబాద్ తీసుకెళ్తామని నమ్మించారు. ఈ క్రమంలో కారులో ఎక్కించుకుని మార్గంమధ్యలో వారిపై పలుమార్లు అత్యాచారం చేసి తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో బాలికలు పోలీసుల కంటబడటంతో అదే రోజు సైదాబాద్ కు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించారు. వారికి కౌన్సెలింగ్ ఇప్పించరు .. తమపై జరిగిన లైంగిక దాడి గురించి బయటపెట్టారు. దీంతో(ఆశ్రమం) పునరావాస కేంద్రం నిర్వాహకులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికలు చెప్పిన వివరాలు ఆధారంగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు