Telangana
జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అక్టోబర్ 24న బెయిల్ పొందారు.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన నెలరోజులు జైలు జీవితం గడిపారు. అక్టోబర్ 24న ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత, ఫిర్యాదుదారు ఆ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు పిటిషన్ ఇచ్చారు. శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే, సుప్రీం కోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసి, హైకోర్టు ఇచ్చిన బెయిల్‌కు జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీంతో జానీ మాస్టర్‌కు ఊరట లభించింది.
జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ అతడి వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2017లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో తెలిపింది. షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపించింది. తన మైనర్ వయస్సులోనే జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాదాపు నెలరోజులు జైల్లో ఉండి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత, జానీ మాస్టర్ ఇటీవల జబర్దస్త్ రాకేష్ కేసీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అరెస్ట్, బెయిల్ విషయం తర్వాత స్టేజ్‌పై మాట్లాడటం, మీడియా ముందుకు రావడం ఇది ఆయన తొలి సారి. ఈ సందర్భంగా, జానీ మాస్టర్ కొంత ఎమోషనల్ అయ్యారు. ఆయన చెప్పినట్లుగా, “ఇటీవల కొన్ని సంఘటనలు జరిగాయి, అప్పుడు బయటకు ఎవరూ రారు.” తనను నమ్మిన ప్రతి ఒక్కరికీ, ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన వారికి థాంక్స్. మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు, త్వరలోనే అన్నీ తెలుస్తాయి” అని చెప్పారు.
ఈ ఇష్యూ తర్వాత, జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు కూడా వచ్చిందని తెలిసిందే. 2022 సంవత్సరానికి జానీ మాస్టర్‌ను బెస్ట్ కొరియోగ్రఫీకి నేషనల్ ఫిల్మ్ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకోవడానికి ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది. అయితే, పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో, నేషనల్ అవార్డు కమిటీ ఆయన అవార్డును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు