Telangana
సీఎం రేవంత్ రెడ్డికి మోదీ బర్త్‌డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

సీఎం రేవంత్ రెడ్డికి మోదీ బర్త్‌డే విషెస్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని పీఎం నరేంద్ర మోదీ వరకు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా, ఎప్పుడూ కటువుగా ఉండే వారు, రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన ప్రత్యేకమైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సంబురాలు జరగుతున్నాయి. ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వస్తున్నాయి. గ్రామ గ్రామాల్లో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టడం, పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కార్యకర్తలు తమ అభిమానం చూపిస్తున్నారు. మరోవైపు, నెట్టింట కూడా రేవంత్ రెడ్డికి ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆయూరారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మోదీ చేసిన ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కూడా. ధన్యవాదాలు చెప్తూ రిప్లయి ఇచ్చారు.
మరోవైపు.. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శల కత్తులు దూసుకునే రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఆ బర్త్‌డే విషెస్.. అందరిలా కాకుండా తనదైన శైలిలో.. కాస్త వ్యంగ్యంగా చెప్పారు కేటీఆర్. హ్యాపీ బర్త్‌డే రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. దానికి కొనసాగింపుగా.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. సర్కార్ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ రాసుకొచ్చారు. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తానని తెలిపారు. ఒకవేళ వాళ్లు కోరితే బర్త్‌డే కేక్ కూడా కట్ చేపిస్తానంటూ తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారన్న వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. అరెస్టు భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాసుకొచ్చాయంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ట్వీట్ చేయగా.. దానికి స్పందిస్తూ కేటీఆర్ ఈమేరకు స్పందించారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు