Connect with us

Telangana

సౌత్ ఇండియాలోనే అతి పెద్దది, హైదరాబాద్‌లో టాలెస్ట్ బిల్డింగ్..

సౌత్ ఇండియాలోనే అతి పెద్దది, హైదరాబాద్‌లో టాలెస్ట్  బిల్డింగ్..

హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ ఐకానికి బిల్డింగ్ అందుబాటులోకి రానుంది. కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో సౌత్ ఇండియాలోనే అతి పెద్ద కమర్షియల్‌ బిల్డింగ్ నిర్మించనున్నారు. 50+ అంతస్తుల్లో అద్భుతమైన డిజైన్‌తో ఈ భవనం నిర్మించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మాణ పనులు చేపట్టనుంది.

ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే చార్మినార్ మరియు  గోల్కొండ లాంటి చారిత్రాత్మక కట్టడాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ కారిడార్‌లో ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద అంతస్తులు బిల్డింగ్స్ కళ్ల ముందు మెదులుతాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఈస్ట్ ప్రాతం ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. హైటెక్ సిటీ, కోకాపేట, నానక్‌రాంగూడ, మాదాపూర్, పుప్పాలగూడ, నార్సింగి, ఖాజాగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద బిల్డింగులు, ఐకానిక్ కట్టడాలు నిర్మించారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా మరో ఐకానిక్ నిర్మాణం అందుబాటులోకి రానుంది. నగరంలోని కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో సౌత్ ఇండియాలనే అతిపెద్ద కమర్షియల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బ్రిగేడ్ గ్రూప్ ఈ నిర్మాణాలను చేపట్టనుంది. అందుకు సంబంధించిన బిల్డింగ్ డిజైన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 50+ అంతస్తుల్లో ఓ కమర్షియల్ బ్లాక్ నిర్మించనుండగా.. అందులో ఓరియన్ మాల్, ఆఫీస్ స్పేస్‌లు, 5 స్టార్ హోటల్ (ఇంటర్‌కాంటినెంటల్) అందుబాటులోకి రానున్నాయి.

మరో బ్లాక్‌లో 60 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో పూర్తిగా నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఓరియన్ మాల్ ముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారం చేసే పెద్ద స్క్రీన్‌తో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది DLF ఎంపోరియో లాగా హై-క్లాస్ ఫ్యాషన్ మాల్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. మాల్ పైభాగంలో డిస్క్ ఆకారంలో ఉన్న నిర్మాణం లాస్ వెగాస్‌లోని ఫ్యాషన్ షో మాల్‌ను గుర్తు చేస్తుందని చెబుతున్నారు. ఈ కమర్షియల్ బ్లాక్ హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ బిల్డింగ్‌గా మారుతుందని అంటున్నారు. ఇది మరో ఐదేళ్లలో అందుబాటులోకి రానున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఐకానిక్ బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించి బ్రిగేడ్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

ప్రస్తుతం హైదరాబాద్‌ సహా సౌత్ ఇండియాలో 30 అంతస్తుల వరకే కమర్షియల్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఈ బిల్డింగ్ 50+ అంతస్తుల్లో నిర్మిస్తే.. నగరం అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో ఆఫీస్‌ స్పేస్‌, నివాస సముదాయాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే రెసిడెన్షియల్‌ బిల్డింగులు నిర్మిస్తున్నారు. తాజాగా 50కి పైగా అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్‌ నిర్మిస్తే, అది అతి పెద్దది అవుతుంది. కోకాపేట నియో పోలీస్‌ ప్రాంతంలో భూముల ధరలు కోట్లు వరకు పెరిగాయి. గతేడాది హెచ్ఏండీఏ నిర్వహించిన వేలంలో ఇక్కడ ఒక ఎకరం భూమి రూ.100 కోట్లు పైగా అమ్ముడైంది.

Loading

Trending