Uncategorized
అదిపోయే ట్విస్ట్‌తో సీన్ రివర్స్ పుష్ప మూవీ రేంజ్‌లో ప్లాన్ చేశాడు.. పోలీసులు అవాక్కు

అదిపోయే ట్విస్ట్‌తో సీన్ రివర్స్ పుష్ప మూవీ రేంజ్‌లో ప్లాన్ చేశాడు.. పోలీసులు అవాక్కు
కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గురువారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ట్యాంకర్ లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో చెక్‌పోస్టు దగ్గర వాహనాన్ని ఆపి కంప్లీట్‌గా తనిఖీ చేశారు. ఆ వాహనంలోని ట్యాంకర్ మధ్యలో ప్రత్యేకంగా తయారు చేసిన గదుల్లో 290 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ రూ.72.50లక్షలు ఉంటుందని చెబుతున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పుష్ప సినిమాకు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సీన్‌లు ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలిస్తున్న సీన్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అయితే రీల్ సినిమాలో కాదు, నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం చేసిన ప్లాన్‌ను, ఇక్కడ గంజాయి స్మగ్లర్లు వాడారు. అన్ని సన్నాహాలు బాగా చేసుకున్నారు, కానీ చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ గంజాయి స్మగ్లింగ్ పుష్ప సినిమా స్మగ్లింగ్ సీన్‌ను గుర్తు చేసింది. కుమురం భీం జిల్లా వాంకిడి వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ ఉంది.
అయితే గురువారం సాయంత్రం పోలీసుల తనిఖీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఓ ట్యాంకర్ అటు వైపుగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు ఆ ట్యాంకర్ వెళుతోంది.. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించండంతో చెక్‌పోస్టు దగ్గర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అప్పుడు అసలు గుట్టు బయటపడింది.
ఈ ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో గంజాయిని ఉంచారు. 290 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.72.50లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ బల్వీర్ సింగ్‌ను అరెస్టు చేశామని.. ప్రధాన నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గంజాయి పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అభినందించారు.
కంటైనర్ లారీ ట్యాంకర్ నంబర్ ఎంపీ 06.C1339 వాహనం డ్రైవర్ అనుమానంగా కనిపించడంతో పోలీస్ సిబ్బంది ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. కంటైనర్‌లో 145 గంజాయి ప్యాకెట్లు, ఒక్కోటి రెండు కిలోల చొప్పున, మొత్తం 290 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ సుమారు రూ.72.50 లక్షలు ఉంటుందని, గంజాయి తీసుకెళ్తున్న డ్రైవర్ బల్వీర్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి వ్యవహారం వెనుక అసలు గ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు

-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు