Latest Updates
మరణం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.. ప్రాణం తీసిన సైకిల్..!

మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించటం కష్టం. ఈ ప్రపంచంలో జీవిత కాలం ఉన్నంత వరకే మనం ఉంటాం. ఎంతటి ప్రమాదం జరిగినా, దయతో బతికి బయటపడొచ్చు. అదే ఆయువు తీరితే మాత్రం. చిన్న చిన్న ప్రమాదాలకు సైతం ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ముంబైలో ఓ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ యువకుడు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా ప్రాచుర్యం పొందాయి.
ముంబై మీరా -భయందర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైకిల్ ప్రమాదంలో 16 ఏళ్ల యువకుడు నీరజ్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్వతహాగా సైక్లిస్ట్ అయిన నీరజ్.. సైకిల్ స్టంట్ చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ దుకాణం ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా, వెన్నులో వణుకు పుట్టేలా ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్ యాదవ్ అనే యువకుడు మీరా రోడ్‌లో నివాసం ఉండేవాడు. నాలుగు రోజుల క్రితం (అక్టోబర్ 28) తన సైకిల్‌పై ఘోడ్ బందర్ కోటకు వెళ్లేందుకు బయటికి వెళ్లాడు. స్లైకిస్ట్ అయిన నీరజ్ సైకిల్‌పై స్టంట్స్ చేస్తూ బయల్దేరాడు. ఈక్రమంలో ఓ కాలనీలో అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ ఇంటి గేటు గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర రక్తస్రావంతో నీరజ్ అచేతనంగా పడిపోయాడు. అక్కడ నుంచి వెళ్తున్న కొందరు వ్యక్తులు అతడిని వెంటనే దగ్గరలో ఉన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన డాక్టర్లు నీరజ్ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భయంకరమైన సైకిల్ ప్రమాదంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘భయంకరమైన ప్రమాదం. గుండె ఆగిపోయేలా ఉంది. అతని తల గోడకు కొట్టుకోవడం చూడలేకపోతున్నాను. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
‘దురదృష్టవశాత్తూ అతని తల కాంక్రీట్/మెటల్ గేట్ పదునైన అంచుకు తగిలింది. సైక్లిస్ట్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాదం తప్పేది. “చెడు సంఘటన” అని ఒకరు కామెంట్ చేయగా, “పిల్లలు తమ ప్రాణాలను ప్రమాదంలోకి తీసుకెళ్లి ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? “అర్థం కావడం లేదు” అని మరొకరు చెప్పారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు