Connect with us

Entertainment

కంగువ మూవీ రిలీజ్‌కి ముందు షాక్.. ఎడిటర్ నిషాద్ యూసఫ్ మృతి

తమిళ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుందని అందరికి తెలుసు. నవంబర్ 14న ఈ మూవీ రిలీజ్ అవుతున్న వేళ మూవీ టీమ్ మొత్తం ప్రమోషన్స్‌లో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో కంగువ టీమ్‌కి అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాకి ఎడిటర్‌గా పని చేసిన నిషాద్ యూసఫ్ (43) తాజాగా కన్నుమూశారు. అనుమానాస్పద రీతిలో తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు నిషాద్. ఈ విషయం అందరినీ షాక్‌కి గురి చేస్తుంది.

కేరళ కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో నిషాద్ మృతి చెందారు. బుధవారం రోజు అర్ధరాత్రి 2 గంటలకి నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. అయితే నిషాద్ మృతి అనుమానాస్పదంగా ఉందని.. ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు. కానీ ఇది సూసైడ్ అనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. ఇక నిషాద్‌కి పెళ్లి అయి ఒక పాప ఉంది. నిషాద్ మృతి పట్ల అటు మాలీవుడ్ ఇటు కోలీవుడ్ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కంగువ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఎడిటర్ నిషాద్ యూసఫ్ మరణం విషాదకరం. అతని మరణవార్త అందరిని షాక్ కి గురి చేసింది. అతని టాలెంట్, డెడికేషన్, విజన్.. ఇవన్నీ మా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. మీరు లేరనే విషయం మమ్మల్ని శూన్యంలోకి నెట్టేసింది. మీ కుటుంబం, ఫ్రెండ్ అందరికీ ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం” అంటూ స్టూడియో గ్రీన్ పోస్ట్ చేసింది.

కేరళకు చెందిన నిషాద్ యూసఫ్ ఎడిటర్‌గా ఎన్నో సినిమాలు చేశారు. అందులో ముఖ్యంగా టొవినో థామస్ నటించిన తల్లుమలా సినిమా నిషాద్‌కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అలానే సౌదీ వెళ్లక్క, అడియోస్ అమిగోస్, ఉండా, వన్ వంటి చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండు మూడేళ్లుగా ఎడిటర్‌గా ఎన్నో ఆఫర్లు దక్కించుకున్నారు నిషాద్. ఇప్పుడు సూర్య లాంటి స్టార్ హీరో నటించిన కంగువకి కూడా ఎడిటర్‌గా పని చేసాడు. అలాగే మరోవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాబోయే చిత్రం బజుకాకి కూడా ఎడిటర్‌ నిషాద్‌యే.

నిషాద్ తన ఎడిటింగ్ కి గాను ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. 2022లో కేరళ స్టేట్ ఫిలిమ్ అవార్డును నిషాద్ అందుకున్నారు. అంతే కాదు తల్లుమలా మూవీకి గాను బెస్ట్ ఎడిటర్ అవార్డు ను నిషాద్ యూసఫ్‌ అందుకున్నాడు.

Advertisement

Loading

Trending