Entertainment
కంగువా రెండు వేల కోట్లు..? సూర్య చెప్పిన సమాధానానికి చప్పట్లు

సూర్య ప్రస్తుతం కంగువాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. సూర్యకి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ మూవీస్ నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాయి. సూర్యని పాన్ ఇండియన్ నటుడ్ని చేశాయి. కానీ థియేటర్ల పరంగా పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు రాలేదు. కంగువాను భారీ స్థాయిలో నిర్మించారని తెలుస్తోంది. అన్ని భాషల్లో కంగువా రిలీజ్‌కు రెడీగా ఉంది. నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. దింతో దేశంలోని పలు నగరాల్లో కంగువా టీం సందడి చేస్తోంది.
కంగువా ప్రస్తుతం ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను అయితే క్రియేట్ చేసింది. సూర్యతో పాటుగా కార్తీ కూడా ఇందులో కనిపించబోతోన్నాడని సమాచారం. అయితే ఇదే ప్రశ్నను సూర్య ని అడిగితే.. ఇప్పుడే చెప్పేస్తే ఆ థ్రిల్, సస్పెన్స్ ఎలా ఉంటుంది? థియేటర్లోనే చూడాలి.. ఇంకా చాలా మూమెంట్స్ ఉంటాయని అన్నాడు.. కానీ కార్తీ ఉంటాడో.. ఇంక వేరే హీరోలేమైనా వస్తారో.. అవన్నీ థియేటర్లోనే చూడండి అని అన్నారు. కంగువా సెట్ లో ప్రతీ రోజూ దాదాపుగా మూడు వేల మంది వరకు వర్క్ చేశారని అన్నాడు. అందరినీ శివ చక్కగా హ్యాండిల్ చేశాడని సూర్య చెప్పాడు.
శివకి ఉన్న ఆ మంచి విజన్‌కు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చి కంగువాకి పని చేసారు అని అన్నాడు. శివకి ఉన్న పాజిటివిటీ తోనే ఈ కంగువా సినిమా ఇంత గ్రాండియర్‌గా వచ్చిందని సూర్య అన్నాడు. నిర్మాత తమిళ మీడియాతో మాట్లాడినప్పుడు.. కోలీవుడ్‌లో ఫస్ట్ రెండు వేల కోట్ల మూవీ కంగువా అవుతుందని అన్నాడు. ఇదే విషయాన్ని సూర్యను తెలుగు మీడియా అడిగింది.
నిర్మాత అలా రెండు వేల కోట్లు అన్నాడు.. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అని సూర్యని అడిగితే.. పెద్దగా, భారీగా, ఉన్నత స్థాయిలో కలలు కంటే అది ఏమైనా నేరమా? కాదు కదా.. ఆ కలలు నిజం అయితే అందరికీ మంచిదే కదా.. జరగనివ్వండి.. మంచేది.. నేను కర్మను నమ్ముతాను.. మేం మా పని సక్రమంగా చేశాం.. అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు