Telangana
హాస్పిటల్లో ఇదేం పనులు.. అది కూడా కూతురి డెలివరీ కోసం వచ్చి.. అడ్డంగా బుక్ అయింది..

ఆస్పత్రికి అందరూ బాధతోనో, లేదా చికిత్స కోసమే వస్తుంటే.. మరికొందరు మాత్రం పనిగట్టుకుని.. దొంగతనాలు చేసేందుకే వస్తున్నారు. అసలే బాధతోనో, వైద్యం కోసం వచ్చి ఇబ్బందులు పడుతున్న వారి నుంచి విలువైన వస్తువులు దొంగిలించి.. మరింత బాధకు కారణమై పాపం మూఠగట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో.. కూతురి డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ తల్లి.. మరో తల్లికి కడుపుకోత పెట్టే పనికి యత్నించి.. అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాగ్ కోఠి ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది.
కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కూతురికి ప్రసవం చేపించేందుకు ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆ మహిళ.. మరో తల్లి బిడ్డను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆస్పత్రి ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను గుర్తించిన సెక్యూరిటీ గార్డు.. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
రెయిన్ బజార్ నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన అస్కారి బేగం(45) అనే మహిళ.. ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే.. ఆమె తన కూతురి డెలివరీ కోసం హాస్పిటల్ కి వస్తే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు ఓ బిడ్డ కావాలని.. అందుకు తనకు డబ్బులిస్తామంటూ ఆఫర్ ఇస్తే.. అస్కారి బేగం ఆ పనికి ఒప్పుకుంది.
ఇందుకోసం గత రెండు రోజులుగా అస్కారి బేగం ప్రయత్నిస్తోంది. దింతో.. నవంబర్ 5వ తేదీన ఆస్పత్రిలో ఉన్నిసా బేగం అనే మహిళ.. మగబిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువును అపహరించేందుకు అస్కారి బేగం ప్రయత్నించింది. అయితే.. ఆ శిశువును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి బెదిరించి పంపించాడు. దీంతో.. అక్కడి నుంచి ఉట్టి చేతులతోనే వెళ్లిపోయిన అస్కారి బేగం.. ఆ తర్వాతి రోజు మళ్లీ వచ్చింది. అప్పుడు కూడా శిశువును ఎత్తుకెళ్లేందుకు ధైర్యం సరిపోలేదో ఏమో.. కానీ అక్కడే టెన్షన్ పడుతూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో.. సెక్యూరిటీ గార్డును అనుమానం వచ్చి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు విచారించగా.. అసలు విషయం బయటపెట్టింది అస్కారి బేగం. అస్కారి బేగంపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను రిమాండ్‌కు తీసుకెళ్లారు. అయితే.. గతంలోనూ అస్కారి బేగం మీద కొన్ని కేసులు ఉన్నట్లు తెలిసింది. ఏకంగా 9 పోలీస్ స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదు అయినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు