Connect with us

Business

ఒక షేర్ ఉన్నవారికి 2 షేర్లు.. మరో 10 రోజులు మాత్రమే..

స్మాల్ క్యాప్ కేటగిరి ఆగ్రో ప్రాసెసింగ్ స్టాక్ అయిన సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు స్టాక్ స్ప్లిట్‌కి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఒక షేరును 2 షేర్లుగా మార్చునుంది. తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్‌కి సంబంధించిన రికార్డ్ తేదీన కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఆగ్రో ప్రాసెసింగ్ సెక్టార్ స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ సుఖ్జిత్ స్టార్చ్అండ్ కెమికల్స్ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇటీవలే సమావేశమై స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం తెలుపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్టాక్ విభజనకు సంబంధించిన రికార్డు తేదీని కంపెనీ ప్రకటించింది.ఒక షేర్ కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రెండు షేర్లు రానున్నాయి. కానీ, స్టాక్ స్ప్లిట్ వల్ల షేర్ ధర సగం తగ్గిపోతుంది. ఈ కంపెనీ స్టాక్ గత ఏడాదిలో 36 శాతం లాభం ఇచ్చిందని చెప్పాలి.

సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కొద్ది రోజుల క్రితం జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశమై 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించింది. అంటే రూ. రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక్క ఈక్విటీ షేర్‌ను రూ. 5 ముఖ విలువ కలిగిన రెండు ఈక్విటీ షేర్లుగా విభజించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు తేదీని అక్టోబర్ 25, 2024గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.ఈ రికార్డ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో ఒక షేరు ఉంటే రెండు షేర్లుగా మారనుంది. వంద షేర్లు ఉంటే 200 షేర్లు రానున్నాయి.

ఈ క్రమంలో సుఖ్జిత్ స్టార్చ్ షేరుకి బై రేటింగ్ ఇస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్ అనలిస్ట్ ఏ ఆర్ రామచంద్రన్ ఇన్వెస్టర్లకు సూచించారు. ఇందులో భాగంగా ఈ కంపెనీ స్టాక్‌కి రూ. 597 కొత్త టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నట్లు వీఎల్ఏ అంబాలా పేర్కొన్నారు. అలాగే రూ. 559 వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలని నిపుణులు సూచించారు. ఈ స్టాక్ త్వరలోనే ఇచ్చిన టార్గెట్ చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ గమనిస్తే ఈ కంపెనీ స్టాక్ 0.49 శాతం మేర నష్టపోయి రూ.574 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.628.80 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.392.30 వద్ద ఉంది. గత వారం 5% పెరిగింది, నెలలో 1% లాభమొచ్చింది. ఆరు నెలల్లో 23% మరియు ఏడాదిలో 36% లాభాలను సాధించింది.ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.896.70 వద్ద ఉంది.

Loading

Advertisement

Trending