Connect with us

Entertainment

SSMB29: మహేష్, రాజమౌళి మూవీపై బిగ్‍ అప్‍డేట్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్..

RRR సినిమాతో రెండేళ్ల క్రితం గ్లోబల్ రేంజ్‍లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మన తెలుగు దర్శకుడు SS రాజమౌళి. రామ్‍చరణ్, ఎన్టీఆర్ కలిసి హీరోలుగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‍బస్టర్ కొట్టింది. రాజమౌళి పేరు హాలీవుడ్‍లోనూ మార్మోగిపోయింది. దాంతో మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే చిత్రం (SSMB29) క్రేజ్ వేరే లెవెల్‍లో ఉంది. గ్లోబల్ రేంజ్‍లోనే భారీ బడ్జెట్‍తో ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించనున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే నిరీక్షణ మాత్రం కొనసాగుతోంది.

SSMB29 చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‍పై ఆయన బిగ్‍ అప్‍డేట్ చెప్పారు. తాజాగా ఓ ప్రెస్‍మీట్‍లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ గారు ఈ విషయాన్ని బయటపెట్టారు. SSMB29 అప్‍డేట్ చెప్పాలని ఈ మీట్‍లో విజయేంద్ర ప్రసాద్‍కు ప్రశ్న ఎదురైంది. దీంతో కాసేపు అలా ఆలోచించి విషయం చెప్పేశారు. 2025 జనవరిలో షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. దీంతో మరో మూడు నెలల్లోనే ఈ గ్లోబల్ రేంజ్ మూవీ షూటింగ్ షురూ కానుంది.

వచ్చే ఏడాది జనవరిలో SSMB29 షూటింగ్ స్టార్ట్ అవుతుందనే అప్‍డేట్ రావడంతో అటు మహేష్ బాబు అభిమానులు.. ఇటు రాజమౌళి ఫ్యాన్స్ సంతోషంతో పొంగిపోతున్నారు. రూ.3,000కోట్ల మూవీ లోడింగ్ అంటూ అప్పుడే పోస్టులు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‍ను షేక్ చేసే కాంబో అంటూ అభిప్రాయపడుతున్నారు. SSMB29 మూవీ కోసం మహేష్ బాబు కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే నయా లుక్‍తో రెడీ అయ్యారు. ఎక్కువ గడ్డం, లాంగ్ హెయిర్‌తో మహేశ్ లుక్ అదిరిపోయింది. మహేష్ ముందు హాలీవుడ్ స్టార్స్ కూడా దిగదుడుపే అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ చిత్రం కోసం కండలను కూడా భారీగానే పెంచారు సూపర్ స్టార్. ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు.

రాజమౌళి కూడా షూటింగ్ ముందు చేయాల్సిన ప్లాన్‍ను ఈ మూవీ కోసం చేస్తున్నారని అర్ధమవుతుంది. వర్క్ షాప్‍లు కూడా ఇప్పటికే జరిగాయని టాక్ ఉంది. మూడేళ్లలో ఈ సినిమాను ఫినిష్ చేసేలా రాజమౌళి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాల సార్లు చెప్పారు. స్క్రిప్ట్ పూర్తయిందంటూ ఈ ఏడాది జూలైలోనే ఆయన వెల్లడించారు. అయితే స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‍కు రాజమౌళి కొన్ని మార్పులు చేశారన్నది కూడా ఇండస్ట్రీ టాక్.

Loading

Advertisement

Trending