Entertainment
తన సినిమా టైటిల్ లీక్.. మండిపడ్డ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

సినిమాలకు సంబంధించిన లీక్స్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటాయి. ఈ మధ్యనే మంచు విష్ణు “కన్నప్ప” సినిమాకు సంబంధించిన ప్రభాస్ లుక్ లీక్ అయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయం పై విష్ణు స్పందిస్తూ, ఎవరు లీక్ చేశారో తెలుసిస్తే ఐదు లక్షలు రివార్డు ఇస్తానని ప్రకటించాడు. అయితే, అసలు లుక్ లీక్ విషయం చాలా మందికి తెలియకపోయినా, విష్ణు ట్వీట్‌తో అందరికీ తెలిసింది. దీనిని చూసి “కన్నప్ప” టీం కావాలనే ఇలా చేసి ప్రమోషనల్ స్ట్రాటజీ అనుకుంటున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా లీకుల్లో నిజానికి రెండు రకాలుంటాయి. కొందరు కావాలని లీకులు చేస్తారు, మరికొందరి గమనించని పొరపాట్ల వల్ల అవి బయటకు వస్తాయి. లీకులపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశాడు. “దసరా” సినిమాతో నానికి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్, ఈ విషయంలో తన అభిప్రాయం బలంగా వెల్లడించాడు. దసరా సినిమా తన మొదటి చిత్రం అయినప్పటికీ, టాలీవుడ్‌లో శ్రీకాంత్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా నానికి తొలి వంద కోట్ల క్లబ్ మూవీయగా నిలిచింది.
లీకులపై శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, “సినిమాకు ఏదైనా లీక్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్ లేదా రైటర్లను నిందించొద్దు. వాళ్లే సినిమాకు నిజమైన బలం” అని చెప్పాడు. తన సినిమాకు సంబంధించిన టైటిల్ లీక్ విషయమై తన టీం మెంబర్లు ఆ పని చేయలేదని, కాస్త పరుషంగా స్పందించాడు. తన ట్వీట్లో శ్రీకాంత్ ఓదెల ఎమోషన్‌తో బూతులు పెట్టడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాని నటిస్తున్న “పారడైజ్” మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాలో విలన్, హీరోయిన్ ఎవరు అనే విషయాలు ఇంకా ప్రకటించలేదు. “నాని-ఓదెల 2″పై కూడా మంచి అంచనాలున్నాయి.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు