Connect with us

Entertainment

సలార్ ఉగ్రం రీమేక్ అని తెలీదు.. మొదట్లో బాధపడ్డా..

ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాతో దర్శకుడిగా నిలబడ్డాడు. తన హీరో శ్రీమురళీని స్టార్ హీరోగా చేశాడు. ఆ టైంలోనే ఉగ్రం 2 కూడా అనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో మళ్లీ సినిమా ఉంటుందని కూడా శ్రీ మురళీ చెబుతుండేవాడు. ఉగ్రం ఎండింగ్‌లోనూ సీక్వెల్ హింట్ ఉంటుంది. అయితే కేజీయఫ్‌తో ప్రశాంత్ నీల్ స్థాయి పెరగడంతో ప్రభాస్‌తో ఛాన్స్ కొట్టేశాడు. సలార్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాడు. ఉగ్రం రీమేకే సలార్ అని ముందు లీకులు వచ్చాయి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం వాటిని కొట్టిపారేశాడు.

సలార్ రిలీజ్‌కు దగ్గర పడ్డ టైంలో ప్రమోషన్స్ టైంలో ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. ఉగ్రం రీమేక్ అని అనడం కంటే.. అప్డేటెడ్ వర్షన్ అని అనొచ్చు అంటూ బాంబ్ పేల్చాడు. సలార్ మూవీని చూస్తే ఉగ్రం పాయింట్, మేకింగ్, నెరేషన్ కనిపిస్తాయి. దీంతో కొంత వరకు ఆడియెన్స్ నిరాశ పడ్డారు. ఉగ్రం రీమేక్‌కు ఇంత బిల్డప్ ఇవ్వాలా? అంటూ అందరూ అనుకున్నారు. మరి శ్రీమురళికి ప్రశాంత్ నీల్ అన్యాయం చేశాడా? అని అంతా చర్చించుకున్నారు.

సలార్ అనేది ఉగ్రం రీమేక్ అని నాకు తెలీదంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు శ్రీ మురళీ. భగీరా ప్రమోషన్స్‌లో తెలుగు మీడియాతో శ్రీ మురళీ మాట్లాడాడు. ఈ క్రమంలో ఈ ఉగ్రం రీమేక్, సలార్ గురించి చెప్పాడు. నాకు అసలు ఉగ్రమ్ రీమేక్ సలార్ అని అసలు తెలీదని అన్నాడు. తెలిసిన తరువాత చిన్న పిల్లాడిలా చాలా బాధపడ్డానని అన్నాడు. తనకు ప్రశాంత్ నీల్ విజన్ తెలుసని, ఆయన తన ఆలోచనల్ని భారీ స్థాయిలో చెప్పాలని అనుకున్నాడని, అప్డేటెడ్ వర్షన్‌ను తీశాడని, సినిమా పట్ల తాను సంతోషంగానే ఉన్నానని అన్నాడు.

శ్రీమురళీతో ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా తరువాత ఇంకొక సినిమా చేయాల్సి ఉంది. అందుకే ఇలా భగీరాతో ఆ బాకీ తీర్చుకున్నట్టు అయింది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ అందించిన కథ ప్రధాన బలంగా నిలిచేటట్టు ఉంది. అయితే కేజీయఫ్, సలార్‌లను చూసి ఒకే రకమైన కలర్ మేకింగ్ పట్ల ఆడియెన్స్ కి బోర్ కొట్టింది. మళ్లీ ఇప్పుడు భగీరాను కూడా అదే స్టైల్లో తీశారు. మరి ఈ మూవీని ఆడియెన్స్ ఎంతలా ఆదరిస్తారో చూడాలి.

Loading

Advertisement

Trending