Entertainment
పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూట్.. బన్నీ, శ్రీలీల ఫోటోలు లీక్..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ఫ 2 మూవీ మీద గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఆర్ఆర్ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను రంగంలోకి దించేశారు. మరో వైపు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. మూడో పాటకు సంబంధించిన హింట్ కూడా వదిలారు. ఇలా అప్డేట్లు, రూమర్లు, వార్తలతో పుష్ప 2 ట్రెండింగ్ గా మారింది. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ మిగిలిన చివరి ఐటం సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉందట. ఈ క్రమంలో సెట్స్ నుంచి శ్రీలీల, బన్నీ ఫోటో లీక్ అయిందట.
బన్నీ, శ్రీలీల స్టెప్పులు వేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట్లోకి వచ్చింది. ఇందులో బన్నీ క్యాస్టూమ్ మీద జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. అదేంటబ్బా.. గ్యాస్ సిలిండర్ వేసే వాడిలా.. పెట్రోల్ బంకులో పని చేసే క్యాస్టూమ్లా ఉందని నెట్టింట్లో కామెంట్లు వస్తూనే ఉన్నాయి. మరి సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నాడు.. ఎలా షూట్ చేస్తున్నాడు.. పుష్ప 2ను ఇంకెంత చెక్కుతున్నాడు అని చర్చలు అయితే ప్రారంభం అయ్యాయి.
మైత్రీ నిర్మాతలు చెప్పిన ప్రకారం ఈ పాటికి షూటింగ్ అంతా పూర్తయి.. ప్రమోషన్స్ ప్రారంభించాలి. కానీ షూటింగ్ పూర్తి కాలేదు. ఫస్ట్ కాపీ ఎడిటెడ్ వర్షన్ లాక్ అయిందని అన్నారు. కానీ మళ్లీ ఆర్ఆర్ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లని రంగంలోకి దించారని తెలుస్తోంది. అసలేం జరుగుతోంద అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. కానీ పూర్తిగా షూటింగ్ కాలేదు. డబ్బింగ్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎడిట్ వర్షన్ కూడా కంప్లీట్ కాలేదని టాక్. మరో వైపు తమన్, శామ్ సీఎస్, అజనీష్లు ఎలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు.. ఎవరిది ఫైనల్ అవుతుంది? అసలు దేవి శ్రీ ప్రసాద్ ని ఎందుకు పక్కన పెట్టేశారు.. వంటి ప్రశ్నలతో సోషల్ మీడియాలో పుష్ప 2 హాట్ టాపిక్‌తో ట్రెండింగ్ గా మారింది. డిసెంబర్ 5 కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ లవర్స్ అంతా పుష్ప 2ని చూసేందుకు ఎదురుచూస్తున్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు