Entertainment
Bigg Boss 8 Telugu Day 28: సోనియా ఓటింగ్‌ని చెప్పిమరీ బయటకు పంపిన నాగార్జున..

మొత్తానికి అంతా కోరుకున్నట్టే జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ వార్త ముందే బయటకు వచ్చేయడంతో.. అసలు ఆమె ఎలిమినేట్ అయిన తరువాత రియాక్షన్ ఏంటి? ఎవరి గురించి ఏమి మాట్లాడింది. సోనియా ఎలిమినేషన్ అయ్యాక.. చిన్నోడు-పెద్దోడి స్పందన ఏంటనేదాని గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం
ఈవారం ఎంటర్ ట్రైన్మెంట్ టాస్క్‌లలో భాగంగా.. ట్యూన్ పట్టు గెస్ కొట్టు, నీకే అంకితం అనే టాస్క్‌లను ఆడించారు. ఇవి ప్రతివారం లాగే సాగాయి. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో నిన్నటి ఎపిసోడ్లో నబీల్‌ని సేవ్ చేశారు. ఇక మిగిలిన నలుగురు.. ప్రేరణ, మణికంఠ, సోనియా, ఆదిత్య ఓంలలో.. ఆల్రెడీ మణికంఠ డేంజర్ జోన్లో ఉంటాడని నిన్ననే చెప్పేశారు. ఎందుకూ అంటే.. హౌస్‌లో ఉన్న సుద్దపూసలంతా మణికంఠని జీరో అని స్టాంప్‌లు వేశారు కాబట్టి.. వాళ్ల నిర్ణయం ప్రకారం నామినేషన్స్‌లో ఉన్న మణికంఠ చివరికి వరకూ డేంజర్ జోన్లోనే ఉంటాడని చెప్పారు నాగార్జున. కాబట్టి ఈ సేవింగ్ ప్రాసెస్‌లో సోనియా, ఆదిత్య ఓం, ప్రేరణ ఈ ముగ్గురూ మాత్రమే పాల్గొన్నారు. ఇందులో ప్రేరణ సేఫ్ అయ్యింది. మిగిలిన వారిలో డేంజర్ జోన్లో ఉన్న మణికంఠతో పాటు.. సోనియా, ఆదిత్య ఓంలను యాక్షన్ రూంలోకి పిలిచారు నాగార్జున. ఇక ఈ ముగ్గురిలో మళ్లీ ఎవరు తిరిగి వస్తారో తెలియదు కాబట్టి.. హౌస్‌లో వాళ్లు సెండాఫ్ ఇచ్చేశారు. సోనియా వెళ్తూ వెళ్తూ.. చిన్నోడికి డీప్ హగ్ ఇచ్చి.. ‘నన్ను గుర్తు చేసుకుని ఇంప్రూవ్ అవ్వు’ అని అన్నది. మణికంఠ అయితే.. ప్రేరణ, విష్ణులు టాప్‌లో ఉండాలి.. అలా ఆడాలి అని చెప్పాడు.
ఇక యాక్షన్ ఎపిసోడ్‌లోకి వెళ్లిన తరువాత.. మణికంఠ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి.. సోనియా, ఆదిత్య ఓంలు మాత్రమే సేవింగ్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆదిత్య ఓం సేఫ్ అయ్యి.. తిరిగి హౌస్‌లోకి వెళ్లాడు. ఆదిత్య ఓం సేఫ్ కాగానే.. చిన్నోడు పెద్దోడు ముఖాలు చూడాలబ్బా మామూలుగా లేవు. సోనియా నవ్వుతూనే ఆల్ ది బెస్ట్ చెప్పింది. మన సుద్దపూస యష్మీ అయితే ఓ మై గాడ్ అని అనేసింది.
ఇక చివరికి మణికంఠ, సోనియాలు మాత్రమే మిగిలారు. ఆ తరువాత నాగార్జున.. కొత్త ఫిటింగ్ పెట్టారు. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ.. ‘మీరు మణికంఠ ఆటలో పనికి రాడు.. జీరో అని అన్నారు. అతను డేంజర్ జోన్లో ఉన్నాడు. అలాగే ఆడియన్స్ సోనియాని లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్లో పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.. హౌస్‌లో ఉన్న మీ తొమ్మది మంది.. ఎవరి పక్షాన నిలబడితే వాళ్లు హౌస్‌లో ఉంటారు. మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతారు. సోనియా, మణికంఠలో ఎవరు ఉండాలో వెళ్లాలో నిర్ణయం మీదే అని అన్నారు నాగార్జున.
ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అని చెప్పి.. సోనియా లీస్ట్ ఓటింగ్‌లో ఉందని కూడా చెప్పి.. మళ్లీ ఈ చెత్త ఫిటింగ్ ఏంటో అర్థం కాలేదు. మీరు వేసే ఓటింగ్ మీకు నాకు తప్ప యాక్షన్ రూంలో ఉన్న వాళ్లకి తెలియదు. కానీ మిమ్మల్ని ఆడియన్స్ వాచ్ చేస్తుంటారు.. మీకు 8 సెకన్లు మాత్రమే టైం అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు నాగార్జున.
మణికంఠ హౌస్‌లో ఉండాలని కోరుకునే వాళ్లు లేచినిలబడండి అని అడిగారు నాగార్జున. దాంతో హౌస్‌లో ఉన్న తొమ్మది మందిలో.. నిఖిల్, పృథ్వీ, నైనికలు తప్ప.. మిగిలిన ఆరుగురు నబీల్, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, ప్రేరణ, విష్ణు ప్రియ, సీతలు మణికంఠకే జై కొట్టారు. దాంతో నాగార్జున.. ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయ్యింది ట్విస్ట్ ఇచ్చారు.
మణికంఠ హౌస్‌లో ఉండాలని కోరుకునే వాళ్లు లేచినిలబడండి అని అడిగారు నాగార్జున. దాంతో హౌస్‌లో ఉన్న తొమ్మది మందిలో.. నిఖిల్, పృథ్వీ, నైనికలు తప్ప.. మిగిలిన ఆరుగురు నబీల్, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, ప్రేరణ, విష్ణు ప్రియ, సీతలు మణికంఠకే జై కొట్టారు. దాంతో నాగార్జున.. ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయ్యింది ట్విస్ట్ ఇచ్చారు.
ఆ తరువాత యాక్షన్ రూంలో ఉన్న సోనియా, మణికంఠలతో మాట్లాడారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా నువ్వు ఎలిమినేట్ అయ్యావ్ అని బాంబ్ పేల్చారు నాగార్జున. ఆ తరువాత మణికంఠ.. డేంజర్ జోన్ వరకూ వచ్చినందున.. నిన్ను జైలుకి పంపిస్తున్నాం.. జైలు నుంచి ఎప్పుడు బయటకు రావాలనేది బిగ్ బాస్ ప్రకటిస్తారు అని చెప్పారు నాగార్జున. దాంతో మణికంఠ.. తనని సేవ్ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక సోనియా ఎలిమినేషన్ అనివార్యం అయ్యింది. అయితే బిగ్ బాస్ హిస్టరీలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసి.. లీస్ట్ ఓటింగ్ ఇచ్చిన తరువాత కూడా మళ్లీ హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇదే తొలిసారి. మొత్తానికి అటు ఆడియన్స్‌తో పాటు.. హౌస్ మేట్స్ కూడా ఛీ కొట్టడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది సోనియా ఆకుల. ఇక ఎలిమినేషన్ తరువాత.. స్టేజ్ మీదికి వచ్చి బాంబ్ పేల్చింది సోనియా.
సోనియా స్టేజ్ మీదికి వచ్చిన తరువాత.. జర్నీ వీడియోను చూపిస్తారు నాగార్జున. అనంతరం.. బ్యూటీఫుల్ జర్నీ సోనియా.. హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్.. అన్నీ ఉన్నాయి అని అన్నారు. ‘గుడ్ వన్ సార్’ అంటుంది సోనియా. ‘గుడ్ వన్?! ఏంటీ కొంచెం షాక్‌లో ఉన్నావా?’ అన్నారు నాగార్జున.
‘మార్నింగ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాను.. నిజానికి నేను ఒంటరిని అయిపోయాను.. నేను కాలేజ్‌లో కూడా అంతే.. నన్ను అంతగా ఇష్టపడరు. కానీ నేను మారను.. ఉన్నది ఉన్నట్లు చెబుతాను.. తప్పు అయితే తప్పు.. ఒప్పు అయితే ఒప్పు చెబుతాను.. అంటూ సోనియా చెబుతూ ఉంటే.. ‘హా.. అది చాలా మందికి నచ్చదు’ అంటారు నాగార్జున. ‘అవును నచ్చదు.. కానీ నేను మార్చుకోదలచుకోలేదు సార్.. నేను ఏం అనుకుంటా అంటే.. నేను నేర్చుకున్నది నా జీవితం నుంచి నేర్చుకున్నా.. చెబితే మంచిగా ఉంటుందని. కానీ చెప్పే పద్దతి మార్చుకుంటే బాగుండు అని చాలా సార్లు అనుకున్నా.. ట్రై చేసినా.. అలాగే ఇంత మార్చుకుంటూనే ఈడదాక వచ్చినా నేను.. లాస్ట్ వీక్ ఎగ్ గేమ్ ఆడినప్పుడు నేను చాలా ఆలోచించినా సార్.. ఫిజికల్ అవ్వడానికి చాలా ఆలోచించాను. ఎందుకంటే నేను ఎప్పుడూ డాన్స్‌లో ఆటలు ఇంతలేదు నాకు.. కరాటే.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నా’ అని అని చెప్పింది. అనంతరం.. నాగ్‌పై ఓ బాంబ్ విసిరింది. తన ఎలిమినేషన్‌కి హోస్ట్ నాగార్జున కూడా ఒక కారణం అన్నట్టుగా.. ‘‘నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశా.. ముందు వారం మీరు నాకేం చెప్పలేదు.. సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు. కాబట్టి నేను బాగానే
ఆడుతున్నానని అనుకున్నా’ అని చెప్పింది సోనియా. అందుకే కదా చెప్పుకోమని అడినా? అంటారు నాగార్జున. ‘అదే సార్, గేమ్ క్లారిటీ గురించే మాట్లాడినా.. ఇంకో విషయం ఏంటంటే సార్.. నిఖిల్, పృధ్వీ.. ఇద్దరూ నేను చెప్పింది ఏది విననే వినరు.. నేను కేవలం ఇలా కాదు అని సలహా ఇవ్వడమే తప్ప.. వాళ్లు విననే వినరు.. అంటుంది సోనియా.
‘ఈ మాటలన్నీ హౌస్ మేట్స్ ముందు మాట్లాడు’ అంటూ.. హౌస్ మేట్స్‌తో మాట్లాడించారు నాగార్జున. ‘సీతూ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే.. విష్ణూతో ఒకటి.. సీతూతో మొదటిలోనే నామినేషన్ చేశాను.. వీళ్లంతా క్లోజ్డ్… యష్మీ అయినా కనీసం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది కానీ.. మిగిలిన వాళ్లంతా మరీ ముఖ్యంగా అమ్మాయిలంతా కలిసే టీమ్ అప్ అయ్యి.. చీఫ్ అప్పుడు కూడా నేను ఒంటరిని అని చూపించారు. ఎందుకో తెలియదు.. ఒకటైతే ఉంది సార్.. సీతూ.. నిఖిల్ అండ్ పృధ్వీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. నిఖిల్ అండ్ పృధ్వీ వీళ్లిద్దరేమో నాకు ప్రాధాన్యత ఇస్తారు.. అందుకే.. వీళ్లు అందరి కోసం అన్నట్లుగా ఉంటారు అంటుంది సోనియా.
సో నిఖిల్ అండ్ పృధ్వీ.. మీరిద్దరే సమస్య.. అంటూనే నాగార్జున.. సోనియాతో.. ఐదుగురు ఆడవాళ్లు నీ మాట వినడం లేదు.. అంటున్నావ్.. అంతేనా అంటారు. ‘లేదు యష్మీ అలా కాదు.. నామినేషన్స్‌లో తప్ప మిగిలినప్పుడు బాగానే ఉండేది నాతో.. ప్రేరణ ఇప్పుడిప్పుడు ఈ వీక్ మారింది. ఇక విష్ణు, ప్రేరణ ఇద్దరూ క్లోజ్ కాబట్టి ఒకరిని ఒకరు ప్రభావితం చేసుకున్నారంతే’ అంటుంది సోనియా. ‘నువ్వు అదే మాట అంటున్నావ్ వాళ్ల గురించి.. వాళ్లు నీ గురించి అదే అనుకుంటున్నారు.. వాళ్లకు ఏం కనిపిస్తుందో అదే నమ్ముతారు కదా.. అదే జరిగింది’ అన్నారు నాగార్జున.
సరే ఒక చిన్న గేమ్ ఆడదాం.. నీ వెనుక మహా తాళీ ఉంది.. ఇందులో ఆరు రకాలను ఎంచుకో.. హౌస్ మేట్స్‌లో ఎవరికి ఏ ఐటమ్ చెందుతుందో చెప్పు అంటారు నాగార్జున. వెంటనే సోనియా.. పులిహోరా విష్ణుకే వెళ్తుంది సార్.. ఆమెకు నచ్చితే ఎంతైనా చేస్తుంది. పులిహోరా కలుపుతూనే ఉంటుంది.. నచ్చకపోతే ఇక అంతే.. ఇంకేముండదిక.. అంది సోనియా. విష్ణు ఫొటోని పులిహోరాపై పెడుతూ. కాకరకాయ వేపుడు సీతూ సార్.. చేదు.. టక్ మని మాట్లాడేస్తుంది.. అండ్ తర్వాత ఇక మాట్లాడను ఇక అంతే ఇక అంటుంది. చేదుగా అంతే ఉంటుంది అని చురకలు వేసింది సోనియా.
ఆవకాయ.. ప్రేరణ. తను క్యూట్ అండ్ స్వీట్ కానీ.. తనకు నచ్చనిది ఏదైనా ఉంటే ఏదొకటి అంటూనే ఉంటుంది.. నబీల్ రోటీలాగే.. సాఫ్ట్‌గానే ఉంటాడు. పైకి అలా కనిపిస్తాడు కానీ.. మంచివాడే.. కేవలం నామినేషన్స్‌లో అలాఉంటాడు కానీ.. తను చాలా సాఫ్ట్ సార్ అంటుంది సోనియా. పాయసం పృధ్వీ.. తనను అంతా ఇష్టపడుతుంటారు.. అలాగే నిఖిల్ అన్నం లెక్క.. అన్నం లేకపోతే ఏం లేదు.. అంటే అక్కడ నువ్వు లేకపోతే ఏం మ్యాటర్ లేదు ఆడ. యష్మీ చాలా టఫ్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది కానీ.. తను చాలా నైస్ అండ్ ఎమోషనల్. ఆమె ఏదో గేమ్‌లో ఏదో ఎట్లా ముందుకు వెళ్లాలి.. ఎలా కనిపిస్తుంది అని భయపడి భయపడి మూవ్ చేస్తోంది కానీ.. తను చాలా ఎమోషనల్ అని చెప్పింది సోనియా. అప్పడం నైనిక… అప్పడం అంటే త్వరగా సులువుగా విరిగిపోతుంది. మెంటల్ స్ట్రెంత్ కావాలి తనకి. వీళ్లు ఏమనుకుంటారు.. అలా అనుకోకు నైనికా అంటుంది సోనియా.
ఇక సోనియా ఎలిమినేట్ అవుతుంటే.. మరి పెద్దోడు నిఖిల్ పరిస్థితి ఏంటని అంతా అనుకున్నారు. నాగార్జునకి కూడా అదే అనిపించినట్టు ఉంది. కావాలని అతన్ని లేపి మరీ ‘ఏంటి నిఖిల్’?? అని అడిగారు. దాంతో నిఖిల్.. కన్నీళ్లు
పెట్టుకున్నాడు. ఐ మిస్ యూ మచ్చా అని ఏడ్చేశాడు నిఖిల్. దాంతో సోనియా.. ఎమోషనల్ అవుతూ.. ‘మంచిగా ఆడు’.. అని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి బిగ్ బాస్ హౌస్‌ను వీడింది. అలా.. బిగ్ బాస్ హౌస్‌లో సోనియా శకం ముగిసిందన్నమాట. అన్నట్టు నాగార్జున చివర్లో ట్విస్ట్‌లు ఇచ్చారు. మణికంఠని జైలులో వేయడంతో పాటు.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని.. మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓట్లు వేసుకోవడం ఆపొద్దని చెప్పారు. సో.. ఈవారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు