Connect with us

Entertainment

పుష్ప 2 సినిమాపై ఫుల్ హైప్ ఎక్కిస్తున్నారు.. దేవీ శ్రీ ప్రసాద్ అలా.. SKN ఇలా..

పుష్ప 2 మీదున్న హైప్, అంచనాల గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్టుని బన్నీ, సుక్కు చాలా జాగ్రత్తగా చెక్కుతున్నారు. అందుకే సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడు డిసెంబర్ 6న మాత్రం పుష్ప రావడం పక్కా అని తెలుస్తోంది. ఈపాటికే సుక్కు పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఎడిటెడ్ వర్షన్‌ను లాక్ చేశాడు.

అయితే ఈ ఫస్ట్ హాఫ్ రివ్యూని ఇప్పుడు మెల్లిగా లీక్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడాడు. తాను ఈ మధ్యే పుష్ప 2 ఫస్ట్ హాఫ్‌ని చూశానని, అందులో రెండు, మూడు సీన్లు ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అని, ఫస్ట్ హాఫ్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందని అన్నాడు. ఇలా దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన రివ్యూ అదిరిపోయింది అని ఫాన్స్ అంటున్నారు.

ఇక నిర్మాత ఎస్ కే ఎన్ కూడా పుష్ప 2 గురించి చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా తన ఘటికాచలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయిపోయాయి. అయితే SKN పుష్ప 2 గురించి చెప్పాడు. ఈ మధ్యకాలంలో బన్నీ డబ్బింగ్ చెబుతుంటే రెండు, మూడు సీన్లు చూశానని.. అదిరిపోయిందంతే అని చెప్పుకొచ్చాడు. అవి చూశాక.. బన్నీకి ఇండియాలో ఉన్న అవార్డులన్నీ వస్తాయనిపిస్తోందంట.

బన్నీ పుష్ప 2 డిసెంబర్‌ 6న రానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రీమియర్లతోనే పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. అన్ని చోట్లా పుష్ప 2 కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. అక్టోబర్‌లోనే షూట్ పూర్తి చేసి.. నవంబర్ మొత్తాన్ని ప్రమోషన్స్ కోసం వాడుకోవాలని టీం ప్లాన్ చేస్తుందంటా. ఇక నవంబర్ చివరి వారంలోనే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేయనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయినా రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Loading

Advertisement

Trending