Connect with us

Telangana

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బర్త్‌డే గిఫ్ట్.. అద్భుతమైన కళాఖండం..!

ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ఎంతోమంది ప్రముఖుల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానాలు సంబురాలు చేసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలు చేపడుతూ.. రేవంత్ రెడ్డిపై అభిమానం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న.. రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒక అరుదైన కానుకను రెడీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు.

రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పట్టు వస్త్రంపై తెలంగాణ ముఖచిత్రంలో చిరునవ్వులతో ఉన్న రేవంత్ రెడ్డి ఫోటోను ఆ వస్త్రం పై నేశాడు వెల్ది హరిప్రసాద్. సుమారు 5 రోజుల పాటు శ్రమించి ఈ అరుదైన కానుకను సిద్ధం చేసినట్టు వెల్ది హరిప్రసాద్ చెప్పారు. ఈ పట్టువస్త్రం పొడవు 32 ఇంచులు, వెడల్పు 47 ఇంచులు. అయితే.. ఈ కానుకను తయారు చేసేందుకు రూ.20 వేల వరకు ఖర్చు అయిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ కానుకను సిద్ధం చేశానని.. అవకాశం కల్పిస్తే ఈ పట్టు వస్త్రాన్ని స్వయంగా వెళ్లి బహుకరిస్తానని హరిప్రసాద్ ఆకాంక్షిస్తున్నాడు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అరుదైన కానుక అందించాలని పట్టు వస్త్రంపై ఆయన చిత్రం వచ్చేలా తయారు ఇది చేశా. సుమారు 5 రోజుల పాటు శ్రమించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేశా. సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కల్పిస్తే.. ఈ అరుదైన కానుకను స్వయంగా అందజేస్తా.” అంటూ నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చెప్పుకొచ్చారు.

కాగా.. వెల్ది హరిప్రసాద్ చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. గతంలో ఎన్నో కళాఖండాలను తయారు చేసి.. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending