Connect with us

Entertainment

‘నా అల్లుడు’ మూవీ నిర్మాత చెరువులో దూకేశాడని.. చెబుతూ నవ్వేసిన శ్రియ

ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు, నరసింహుడు ఇలా ఎన్నో చిత్రాలు దారుణంగా డిజాస్టర్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ టైంలో ఈ చిత్రాల నిర్మాతల గురించి రకరకాల కామెంట్లు వచ్చాయి. అందులో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ ఘటన గురించి శ్రియా చెప్పేసింది. ఎన్టీఆర్‌తో నేను జెనీలియా కలిసి ఓ పెద్ద సినిమాని చేశామని నా అల్లుడు సినిమా గురించి చెప్పింది. ఆ మూవీ నిర్మాత అయినా భరత్ హుస్సేన్ సాగర్‌లో దూకేశాడన్నట్టుగా చెప్పింది.

జాతీయ మీడియాతో శ్రియా మాట్లాడుతూ.. ఈ విషయం గురించి చెబుతూ పగలబడి నవ్వేసింది. నేను, ఎన్టీఆర్, జెనీలియా కలిసి ఓ పెద్ద సినిమాని చేశాం.. ఆ నిర్మాత చాలా ఫన్నీ.. చాలా మంచివాడు.. లాస్ట్ డే పేమెంట్లు అడిగేందుకు వెళ్లాం.. కానీ అప్పటికే నిర్మాత హైద్రాబాద్‌లోని లేక్‌లో దూకేశాడు.. అదృష్ట వశాత్తు ఆయనకు ఏం జరగలేదు.. అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు దూకి ఆయన్ను కాపాడారు అంటూ ఇలా ఆనాటి విషయాలను చెబుతూ తెగ నవ్వింది శ్రియా.

ఆ వీడియోని ఈ లింక్ లో చూడండి..  https://x.com/Salaar__Deva/status/1850926513161740719

ఇక ఈ వీడియోని ఇప్పుడు ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయ్యో ఎన్టీఆర్ నిర్మాతకు ఎలాంటి గతి పట్టింది.. నిర్మాతను నిండా ముంచేశాడే అంటూ ఇలా యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోని ఎక్కువగా షేర్లు చేస్తున్నారు. అసలుకే ఇప్పుడు దేవర విషయంలో కరణ్ జోహర్ ఎక్కువగా నష్టపోయాడు అంటూ ఓ రూమర్‌ నెట్టింట్లో క్రియేట్ చేసారు. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్‌ను క్రియేట్ చేయడం, ఫ్యాన్ వార్‌లు క్రియేట్ చేయడం కామన్‌గా జరుగుతూనే ఉంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మేరకు ముంబైలోనే ఎన్టీఆర్ మకాం పెట్టేశాడు. దీపావళి సెలెబ్రేషన్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ మన తారక్‌కి గట్టిగానే పార్టీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు కొన్ని వీడియోలు నెట్టింట్లోకి వచ్చాయి. తన చేతిలో ఉన్న మందు గ్లాసుని అయాన్ చేతిలోకి ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending