Connect with us

Latest Updates

స్వింగ్ రాష్ట్రాలలో కమలా హ్యారిస్‌కు పెద్ద షాక్.. ట్రంప్ క్లీన్ స్వీప్ దిశగా పోతున్నాడు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో, రిపబ్లికన్ అభ్యర్థి మరియు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు ఆయన 247 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఎవరు సాధిస్తారో? వారే వైట్‌హౌస్‌ను అధిరోహిస్తారు. అయితే, విజయానికి అవసరమైన మెజార్టీకి ట్రంప్ కొద్ది దూరంలో ఉన్నారు. ఇంకా, ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన స్వింగ్ రాష్ట్రాలలో ప్రజలు ట్రంప్‌కే మద్దతు ఇచ్చారు. మొత్తం ఏడుగురు రాష్ట్రాలలో, రెండు చోట్ల విజయాన్ని సాధించి, మరికొన్ని ఐదు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నార్త్, కరోలినా, జార్జియాలో ట్రంప్ గెలుపొందారు. ఆరిజోనా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నెవాడా రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ తక్కువ ఓట్లతో ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు మద్దతుదారులు సమానంగా ఉన్నారు. పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. మిషిగాన్ 10, జార్జియా 16, విస్కాన్సిన్ 10, నార్త్ కరోలినా 16, నెవాడా 6, ఆరిజోనాలో 11 ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గెలిచినవారికే అధ్యక్ష పీఠం దక్కుతుంది. ప్రస్తుతం ట్రంప్‌కు మంచి పరిస్థితి ఏర్పడింది, ఆయనకు ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి. యువ ఓటర్లు కూడా ట్రంప్‌ను మద్దతు ఇస్తున్నట్టు ఫలితాలు చూపిస్తున్నాయి.

అలాగే, అయోవా (Iowa)లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు అద్భుతమైన విజయం అందేలా ఉంది. ఇక్కడ ఆయన విజయం ఖాయమైనట్లు అసోసియేట్‌డ్‌ ప్రెస్‌, ఎన్‌బీసీ ప్రొజెక్షన్స్‌లో వెల్లడైంది. ఇటీవల సర్వేల్లో అక్కడ కమలా హ్యారిస్‌ (Kamala Harris) విజయం సాధిస్తారని పలు పోల్‌ సర్వేలు తెలిపాయి. అన్నా స్లెజర్‌ చేసిన పోల్‌ ప్రొజెక్షన్లు డెమొక్రట్లకు అనుకూలంగా వచ్చాయి. దీంతో రిపబ్లికన్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ ప్రొజెక్షన్‌పై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. అవన్నీ ఫేక్ సర్వేలని కొట్టిపారేశారు. తన కంటే రైతులకు ఎక్కువగా చేసిన అధ్యక్షుడు ఎవ్వరూ లేరని, ఆ సర్వే ఫలితాలకు దగ్గరగా కూడా ఫలితాలు ఉండవని ట్రూత్ సోషల్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవానికి అయోవా రిపబ్లికన్లకు మంచి పట్టున్న రాష్ట్రం గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడి 6 ఎలక్టోరల్‌ ఓట్లు ట్రంప్‌నకే లభించాయి.

Loading

Trending