Connect with us

Telangana

వామ్మో.. అఘోరి ఆమె కాదా.. అతడా..! వెలుగులోకి సంచలన నిజాలు..

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఒక అఘోరి నాగసాధు సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శిస్తూ.. ఆమె పూజలు చేస్తున్నారు. తనను తాను ఒక నాగసాధు అఘోరిగా అందరికి చెప్పకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇటీవల సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన అఘోరి ఒంటికాలిపై నిల్చొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భక్తులు ఆమెను.. ముత్యాలమ్మే పంపించిందని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కొమురవెళ్లి, కీసరతో పాటు పలు ఆలయాలు సందర్శంచించిన అఘోరి శివలింగానికి భస్మంతో అభిషేకాలు చేశారు. దీంతో పలు యూట్యూబ్ ఛానెళ్లు అఘోరిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేశాయి.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఆ అఘోరి గురించిన సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘోరీ ఎవరు..? వారి తల్లిదండ్రులు ఎవరు..? స్వామీజీగా ఎప్పుడు మారారు అనేది తెలుసుకునేందుకు పలు యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు అఘోరి సొంతూరికి వెళ్లారు. మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి అఘోరి స్వస్థలం కాగా.. అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అయితే అఘోరీ మహిళ కాదని తెలిసింది. అతడు ఆమె (ట్రాన్స్‌జెండర్)గా మారినట్లు గ్రామస్థులు, కుటుంబీకులు వెల్లడించారు. అఘోరి అసలు పేరు శ్రీనివాస్ అట. ఆరో తరగతి చదువుతుండగానే చిన్నతనంలోనే శ్రీనివాస్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

దాదాపు 15 ఏళ్ల తర్వాత.. అఘోరిగా మారిన శ్రీనివాస్ పదిహేనేళ్ల తర్వాత స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే.. అఘోరిగా మారిన తర్వాత తమ కుమారుడితో ఎప్పుడూ మాట్లాడలేదని శ్రీనివాస్ తల్లిదండ్రులు వెల్లడించారు. అఘోరీ తమ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఊరిలోని అందరూ తమను వింతగా చూస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే అఘోరిగా మారిన శ్రీనివాస్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది.

డబ్బుల కోసం అఘోరి అవతారమెత్తి ప్రజల్ని మోసం చేస్తున్నట్లు పలువురు నెటిజన్లు, యాట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు విమర్శిస్తున్నారు. దీనిపై అఘోరి నాగసాధు తీవ్ర స్థాయిలో మండిపడింది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న అన్ని యూట్యూబ్ ఛానెల్‌ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అఘోరి ఆమె కాదని.. ట్రాన్స్‌జెండర్ అని పోలీసులు చెప్పారు.

Loading

Advertisement

Trending