Entertainment
విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి..

విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఎప్పుడూ గ్రాండ్‌గానే జరుగుతుంటాయి. అతని అభిమానులు అందరూ దీపావళి ఫోటోలకు ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ దీపావళిని సెలెబ్రేట్ చేసుకునేందుకు చాలా వరకు ప్రయత్నిస్తుంటాడు. దీపావళి టైంకి షూటింగ్‌లు పెట్టుకోకుండా.. అమ్మా, నాన్న, తమ్ముడితో గడిపేందుకు చూస్తుంటాడు. అయితే గత రెండు, మూడు ఏళ్ల నుంచి విజయ్ దీపావళి సెలెబ్రేషన్స్ మీద ఎక్కువగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. విజయ్ ఇంట్లో జరిగే దీపావళి వేడుకల్లో రష్మిక కూడా ఉంటుందని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.
విజయ్, రష్మికలు డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉంటాయి. కలిసి వెకేషన్లో ఉన్నట్టు కోడింగ్ చేసి ఏదో కనిపెట్టినట్టు అన్నీ పంచుకుంటూ, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. వీరిద్దరి గురించి నేషనల్ స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే మరియు త్వరలో పెళ్లి గురించి కూడా వార్తలు వస్తాయని ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని విజయ్, రష్మికలు చెబుతుంటారు.
ఇక తాజాగా విజయ్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకకు సంబంధించిన ఫోటోలపైనా చర్చలు జరిగాయి. ఈ ఫోటోలు తీసింది రష్మిక కదా? అన్నా అంటూ విజయ్ పోస్ట్‌ల కింద కామెంట్లు కనిపించాయి. ఇక రష్మిక షేర్ చేసిన ఫోటోల కింద.. ఈ ఫోటోలను తీసింది ఎవరు అంటూ ప్రశ్నించసాగారు. దీంతో కాసేపటికి అసలు విషయాన్ని బయటపెట్టేసింది రష్మిక.
ఈ ఫోటోలను తీసింది ఆనంద్ దేవరకొండ అని చెప్పింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్ కూడా ఇచ్చేసింది. దీంతో అందరికీ మరోసారి క్లారిటీ వచ్చేసినట్టు అయింది. విజయ్ ఇంట్లోనే దీపావళిని రష్మిక గ్రాండ్‌గా జరుపుకుంటుందని అందరికీ బాగా అర్థమైంది. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. రష్మిక అయితే పుష్ప 2 మూవీతో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు