Entertainment
‘దేవకీ నందన వాసుదేవా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. రానా దగ్గుబాటి మాటలు!

అశోక్ గల్లా హీరో అనే చిత్రం వచ్చాడు. హీరో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. అందుకు చాలా గ్యాప్ తీసుకుని దేవకీ నందన వాసుదేవా అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఈ చిత్రం వచ్చే వారం రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రానా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. స్టేజ్ మీద రానా మాట్లాడుతూ తన స్పీచుతో ఆకట్టుకున్నాడు.
ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఈ మూవీని తానే దర్శకత్వం వహించాలని అనుకున్నాడట. ఇక తాను కథ అందించిన ఈ మూవీ ప్రమోషన్స్‌లోనూ ప్రశాంత్ వర్మ పాల్గొన్నాడు. దాంతో ప్రశాంత్ వర్మ గురించి రానా తన స్పీచులో కొంచెం ఎక్కువగానే మాట్లాడాడు. ప్రస్తుతం ఉన్న తరానికి మైథలాజికల్ జానర్‌ను చెప్పడంతో ప్రశాంత్ వర్మ మాస్టర్ అయ్యాడు అని రానా పొగిడేశాడు.
ఇక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గురించి రానా స్పెషల్‌గా మాట్లాడాడు. ఆయన నా కృష్ణం వందే జగద్గురుం సినిమాకు రాసిన డైలాగ్స్‌తో నేను చాలా మారిపోయాను. దేవుడు అంటే సాయం అని రాసిన డైలాగ్‌తో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చేతనైన సాయాన్ని అందరికీ చేస్తూ వస్తున్నాను అని తెలిపాడు.
మహేష్ బాబు, గల్లా జయదేవ్ ఇలా ఇద్దరితో తనకు ఎన్నో ఏళ్ల బంధం ఉందని, వాళ్లలా సిన్సియారిటీ, డిసిప్లేన్‌తో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంటూ అశోక్ గల్లాకు రానా సలహాలు ఇచ్చాడు. ఈ మూవీ కంసుడు, కృష్ణుడు అనే కాన్సెప్టుతో తీశారని అర్థం అవుతోంది.. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని రానా స్పీచ్ ఇచ్చాడు. చాలా కాలం తరువాత ఇలా తెలుగు హీరోయిన్, తెలుగులో ఇంత బాగా మాట్లాడే వారిని చూస్తుండటం ఆనందంగా ఉందని హీరోయిన్ మానస గురించి చెప్పుకొచ్చాడు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు