Telangana
సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి కోడలు, అలానే మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య అయినా ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మనుసులు గెలుచుకున్నారు. తెలంగాణ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేసిన కృషితో పాటు.. భారత్‌లో ఆర్చరీ క్రీడకు తిరుగులేని మద్దతును అందించినందుకు మా నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ డాడ్..” అంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. కాగా.. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే.. మెగాస్టార్ కోడలిగా.. రాంచరణ్ భార్యగానే కాకుండా.. ఉపాసన ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. అపోలో సంస్థల ప్రతినిధిగా.. యువ వ్యాపారవేత్తగా ఉపసాన గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో ఆస్పత్రుల వ్యవహారాల్లో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఉపాసన.. అపోలోను మరింత విస్తరించే పనులు చేపట్టారు. అదేకాకుండా.. మరికొన్ని కొత్తరకాల వ్యాపారాలు ప్రారంభించి, పలు బిజినెస్‌లలో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంపైనే ఉపాసన ఫోకస్ చేస్తున్నారు.
ఇవన్నీ కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఉపాసన యాక్టీవ్‌గా ఉంటూ.. తన ఫాలోవర్లతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. మన లైఫ్‌లో జరిగే.. ముఖ్యమైన సందర్భాల గురించి పోస్టులు, ఫొటోలు పెడుతూ అందరికి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు.. ఎలాంటి డైట్ తినాలి.. ఎలాంటి వ్యాయామాలు, యోగా లాంటివి చేయాలి.. అంటూ రకరకాల వీడియోలతో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రయత్నాలు కూడా ఉపాసన చేస్తుంటారు. గతంలో.. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిల్లల్లో కూడా డైట్ ప్లాన్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
తాజాగా.. యువ మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ఉపాసన ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన.. హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకుంటున్న వారికి నేను కో ఫౌండర్‌గా ఉంటానని మాట ఇచ్చారు. ఇండియాలో హెల్త్ కేర్ వ్యవస్థను మార్చేందుకు తన వంతు సాయం చేస్తానని చెప్పుకొచ్చారు.
అయితే.. ఇందుకోసం.. “హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? మహిళలు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఒక వ్యవస్థను నిర్మించడానికి నాతో చేతులు కలపండి. మీ బిజినెస్ పర్పస్ ఏంటి.. మీ బిజినెస్ ఎవరిపై ప్రభావం చూపుతుంది.. మీ బిజినెస్ మన ప్లానెట్ కు ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది.. నన్ను మీరు కో ఫౌండర్‌గా ఎందుకు కోరుకుంటున్నారు.. లాంటి వివరాలను cofounder@urlife.co.in వెబ్‌సైట్‌కు పంపించాలని ఉపాసన కోరారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు